వేరొకరితో పెళ్లి.. ప్రియురాలు, ఆమె తల్లి హత్య

Fri,May 10, 2019 12:30 PM

Jilted lover runs over woman and her mother with his car in jodhpur

జోధ్‌పూర్ : ప్రియురాలి పెళ్లి మరొకరితో నిశ్చయమైంది. దీంతో ప్రియురాలు, ఆమె తల్లిని ఓ ప్రేమికుడు దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ జిల్లాలో గురువారం చోటు చేసుకుంది. సుఖ్‌రాం అనే యువకుడు ఇంద్రను గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నాడు. అయితే ఇటీవలే ఇంద్ర తల్లి దామిదేవి(45) ఆమెకు వేరొకరితో పెళ్లి నిశ్చయించింది. ఈ క్రమంలో సుఖ్‌రాం, దామిదేవి మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. ఇక గురువారం మధ్యాహ్నం ఈ ముగ్గురు కలిసి కారులో కూర్చొని మాట్లాడుకుంటున్న సమయంలో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దామిదేవి, ఇంద్ర కారు దిగి వెళ్తున్న క్రమంలో వారిపై నుంచి సుఖ్‌రాం కారును తీసుకెళ్లాడు. రెండు, మూడు సార్లు కారును వారిపై వేగంగా తిప్పడంతో ఇంద్ర అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆస్పత్రికి తరలిస్తుండగా దామిదేవి మృతి చెందింది. ఇక సుఖ్‌రాం కూడా పక్కనే ఉన్న కెనాల్‌లో దూకాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సుఖ్‌రాం మృతదేహం కోసం పోలీసులు గాలిస్తున్నారు.

2936
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles