జిగ్నేష్ మేవానీ నిర్బంధం!

Sun,February 18, 2018 01:24 PM

Jignesh Mewani detained in Gujarat over Ahmedabad Bandh call

అహ్మదాబాద్‌ః గుజరాత్ దళిత నేత, ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీని పోలీసులు నిర్బంధించారు. దళిత నేత భానుభాయ్ వాంకర్ ఆత్మాహుతికి నిరసనగా మేవానీ అహ్మదాబాద్ బంద్‌కు పిలుపునిచ్చారు. సారంగ్‌పూర్‌లోని అంబేద్క్ విగ్రహం దగ్గరికి భారీగా తరలిరావాలని ఆయన కోరారు. అయితే మేవానీ అక్కడికి చేరుకునేలోపే సరస్‌పూర్‌లో పోలీసులు ఆయన కారును ఆపి నిర్బంధించారు. మరో దళిత నేత నౌషాద్ సోలంకిని కూడా పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారు. ఆత్మహత్యకు పాల్పడిన భానుభాయ్ మృతదేహాన్ని తీసుకోవడానికి అతని కుటుంబ సభ్యులు నిరాకరించారు. అతని మృతిపై సిట్ ఏర్పాటు చేసి విచారణ జరిపించాలని, రాష్ట్రవ్యాప్తంగా దళితులకు కేటాయించిన భూములను తిరిగివ్వాలని డిమాండ్ చేస్తూ వేల మంది దళితులు ఆ కుటుంబానికి అండగా గాంధీనగర్ ప్రభుత్వ ఆసుపత్రి ముందు నిరసన తెలిపారు. దీనిపై స్పందించిన డిప్యూటీ సీఎం నితిన్ పటేల్.. భూమిని భానుభాయ్ కుటుంబ సభ్యుల్లో ఒకరి పేరు మీదికి బదలాయిస్తామని చెప్పారు. అతని మృతిపై రిటైర్డ్ హైకోర్టు జడ్జి నేతృత్వంలో సిట్ కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, రూ.8 లక్షల నగదు ఇవ్వనున్నట్లు తెలిపారు.

1110
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles