రూపాయికే మెజార్టీ వాటా అమ్ముకున్న జెట్ ఎయిర్‌వేస్.. ఎందుకు?

Wed,February 20, 2019 01:00 PM

Jet Airways selling their majority stake for just one rupee

న్యూఢిల్లీ: మీరు చదివింది నిజమే. దేశంలోని టాప్ 3 ఎయిర్‌లైన్స్‌లో ఒకటైన జెట్ ఎయిర్‌వేస్ ఈ పని చేసింది. తన కంపెనీలోని 50.1 శాతం వాటాను కేవలం రూపాయికే అమ్మేసింది. దీనికి కారణం అప్పులు. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన ఆ సంస్థ ఇప్పుడు ఆ అప్పులిచ్చిన బ్యాంకులతో ఈ తాత్కాలిక బెయిల్ ఔట్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అటు లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో 23 వేల మంది ఉద్యోగులు ఉన్న ఈ సంస్థ మూత పడకుండా అటు ఎన్డీయే ప్రభుత్వం కూడా అన్ని చర్యలూ చేపడుతున్నది. వ్యాపారవేత్త నరేష్ గోయల్ ప్రారంభించిన జెట్ ఎయిర్‌వేస్ ఈ మధ్య అప్పుల్లో కూరుకుపోయింది. ప్రస్తుతం ఈ సంస్థలో 24 శాతం వాటా అబు దాబికి చెందిన ఎతిహాడ్ ఎయిర్‌వేస్ చేతుల్లో ఉంది.

దేశంలో 13.9 శాతం మార్కెట్‌ను ఈ జెట్ ఎయిర్‌వేస్ కవర్ చేస్తున్నది. 2000 ప్రాంతంలో ఎన్నో ప్రైవేట్ సంస్థలు విమానయాన రంగంలోకి రావడం జెట్ ఎయిర్‌వేస్ కొంప ముంచాయి. ధరలు తగ్గించడం, విమాన ఇంధన ధరలపై పన్నులు 30 శాతం వరకు చేరడంలాంటి వాటితో ఖర్చులు పెరిగి, లాభాలు క్షీణించి అప్పుల్లో కూరుకుపోయింది. ప్రస్తుతం ఆ సంస్థకు రూ.7299 కోట్ల అప్పు ఉంది. వీటిని తీర్చే పరిస్థితుల్లో ఆ సంస్థ లేకపోవడంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని బ్యాంకులు.. సంస్థలోని 50.1 శాతం వాటాని కేవలం రూపాయికే సొంతం చేసుకున్నాయి.

అయితే ఇది తాత్కాలిక ఒప్పందమే. జెట్ ఎయిర్‌వేస్ మళ్లీ గాడిలో పడాలంటే ప్రస్తుతం రూ.8500 కోట్లు కావాలి. అది కొత్త పెట్టుబడులు, రుణాల పునర్‌వ్యవస్థీకరణ, ఆస్తుల అమ్మకాల ద్వారా సాధ్యమవుతుంది. ప్రస్తుతం బ్యాంకులు తాత్కాలికంగా ఆ రుణాన్ని షేర్ల రూపంలోకి మార్చాయి. కొత్త పెట్టుబడుల కోసం టాటా గ్రూప్‌తో జెట్ ఎయిర్‌వేస్ సంప్రదింపులు జరుపుతున్నది. నరేష్ గోయల్ తన 25 శాతం వాటా నిలుపుకోవడానికి మరో రూ.700 కోట్లు ఇవ్వనున్నారు. అటు ఎతిహాడ్ సంస్థ మరో రూ.1400 కోట్లు పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది.

1340
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles