జెట్ విమానాల‌న్నీ పాక్షికంగా ర‌ద్దు !

Tue,April 16, 2019 02:50 PM

Jet Airways likely to cancel all flights temporarily


హైద‌రాబాద్ : న‌ష్టాల ఊబిలో ఉన్న జెట్ ఎయిర్‌వేస్‌.. పూర్తిగా స్తంభించింది. ఆ సంస్థ‌కు చెందిన విమానాలు అన్నీ తాత్కాలికంగా ర‌ద్దు అయిన‌ట్లు తెలుస్తోంది. జెట్ సంస్థ సుమారు 8 వేల కోట్ల అప్పులో ఉన్న‌ది. ప్ర‌స్తుతం ఆ కంపెనీకి చెందిన ప‌ది విమానాలు మాత్ర‌మే సేవ‌లు అందిస్తున్నాయి. ఇక నుంచి అవి కూడా ఎగ‌ర‌వ‌ని తెలుస్తోంది. జెట్ ఎయిర్‌వేస్ వ్య‌వ‌స్థాప‌కుడు న‌రేశ్ గోయ‌ల్‌, ఆయ‌న భార్య అనితా గోయ‌ల్‌.. గ‌త నెల‌లో సంస్థ‌కు రాజీనామా చేసిన విష‌యం తెలిసిందే. ఇవాళ ముంబైలో జెట్ సంస్థ బోర్డ్ మీటింగ్ జ‌రుగుతున్న‌ది. జెట్‌ను ఆదుకునే ప్ర‌య‌త్నాలు విమాన‌యాన‌శాఖ చేసినా ఫ‌లితం లేకుండాపోయింది. ఆ సంస్థ‌కు ఎమ‌రెన్సీ నిధులు ఇచ్చేందుకు ఎవ‌రూ ముందుకు రాలేదు.

1000
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles