విమానం టేకాఫ్ తీసుకోగానే.. చెవులు, ముక్కుల‌ నుంచి రక్తం

Thu,September 20, 2018 09:39 AM

Jet Airway passengers suffer nose, ear bleeding

న్యూఢిల్లీ: పైలట్ల నిర్లక్ష్యం వల్ల జెట్ ఎయిర్‌వేస్ ఫ్లయిట్‌లో ప్రయాణికులు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ముంబై నుంచి జైపూర్‌కు ఇవాళ ఉదయం టేకాఫ్ తీసుకున్న విమానంలో ఈ ఘటన జరిగింది. సుమారు 30 మంది ప్రయాణికుల చెవులు, ముక్కుల‌ నుంచి అకస్మాత్తుగా రక్తం వచ్చింది. 9డబ్ల్యూ 696 నెంబర్ ఫ్లయిట్‌లో ఈ ఘటన చోటచేసుకున్నది. ఆ సమయంలో విమానంలో మొత్తం 166 మంది ప్యాసింజెర్లు ఉన్నాయి. టేకాఫ్ సమయంలో క్యాబిన్‌లో ఎయిర్ ప్రెజర్‌ను నియంత్రించే స్విఛ్‌లను ఆఫ్ చేయడం వల్ల ఈ ఘటన జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ప్రయాణికుల ముక్కు నుంచి రక్తం రావడంతో.. పైలట్లు మళ్లీ విమానాన్ని వెంటనే ముంబైలో దించారు. చాలా మంది ప్రయాణికులు తమకు తలనొప్పి వచ్చినట్లు ఫిర్యాదు చేశారు. విమానంలో ఉన్న ప్రతి ఒక ప్యాసింజెర్‌కు ఎయిర్‌పోర్టులో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఏవియేష‌న్ అధికారులు వెంట‌నే డ్యూటీ స్టాఫ్‌ను విధుల నుంచి తొల‌గించారు. ఈ ఘ‌ట‌న ప‌ట్ల పౌర విమాన సంస్థ విచార‌ణ చేప‌ట్టింది. విమానంలో వెళ్లాల్సిన ఉన్న అతిథుల కోసం ప్ర‌త్యేక ఏర్పాట్లు చేశారు.4997
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles