పుల్వామా మాస్ట‌ర్‌మైండ్ హ‌తం !

Mon,March 11, 2019 12:10 PM

JeM terrorist Mudasir Ahmed Khan killed in Kashmir encounter

హైద‌రాబాద్‌: పుల్వామాలో ఫిబ్ర‌వ‌రి 14వ తేదీన సీఆర్‌పీఎప్ జ‌వాన్ల కాన్వాయ్‌పై ఆత్మాహుతి దాడి జ‌రిగిన విష‌యం తెలిసిందే. అయితే ఆ దాడికి ప్లాన్ వేసిన జైషే ఉగ్ర‌వాది ముద‌సిర్ అహ్మ‌ద్ ఖాన్ అలియాస్ మ‌హ్మ‌ద్ భాయ్‌.. గ‌త రాత్రి జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌లో హ‌త‌మైన‌ట్లు తెలుస్తోంది. ద‌క్షిణ క‌శ్మీర్‌లోని త్రాల్ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంట‌ర్ జ‌రిగింది. ఈ ఎదురుకాల్పుల్లో మొత్తం ముగ్గురు మిలిటెంట్లు హ‌త‌మైన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. గుర్తుప‌ట్ట‌లేని రీతిలో మిలిటెంట్లు మృత‌దేహాలు ఉన్న‌ట్లు వారు చెప్పారు. పింగ్లిష్ ప్రాంతంలో భ‌ద్ర‌తా ద‌ళాలు.. కార్డ‌న్ సెర్చ్ నిర్వ‌హించాయి. ఇంటెలిజెన్స్ స‌మాచారం ఆధారంగా సోదాలు జ‌రిగాయి. అయితే మిలిటెంట్లు కాల్పులు జ‌ర‌ప‌డంతో.. అక్క‌డ ఎన్‌కౌంట‌ర్ మొద‌లైంది. 23 ఏళ్ల ఖాన్ ఎల‌క్ట్రీషియ‌న్‌గా చేస్తున్నాడు. గ్రాడ్యుయేట్ డిగ్రీ క‌లిగిన అత‌ను పుల్వామాలో నివ‌సిస్తున్నాడు. అయితే ఆత్మాహుతి దాడికి కావాల్సిన వాహ‌నాన్ని, పేలుడు ప‌దార్ధాల‌ను అత‌నే స‌మ‌కూర్చాడు. మీర్ మొహ‌ల్లాకు చెందిన అత‌ను 2017లో జైషేలో చేరాడు. సూసైడ్ దాడికి పాల్ప‌డిన అదిల్ అహ్మ‌ద్ దార్‌.. చాన్నాళ్లుగా ఖాన్‌తో ట‌చ్‌లో ఉన్న‌ట్లు తెలిసింది. ఖాన్ స్థానిక ఐటీఐలో ఎల‌క్ట్రీషియ‌న్ కోర్సు చ‌దివాడు. ఫిబ్ర‌వ‌రిలో సుంజ‌న్‌వాలా ఆర్మీ క్యాంపుపై జ‌రిగిన దాడిలో ఖాన్ పాత్ర ఉన్న‌ట్లు అనుమానిస్తున్నారు. మారుతీ ఈకో మినీ వ్యాన్‌తో పుల్వామాలో ఆత్మ‌హుతి దాడికి పాల్ప‌డ్డారు. ఫిబ్ర‌వ‌రి 27వ తేదీన ఖాన్ ఇంట్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేశారు. దాడికి ప‌ది రోజుల ముందే ఈ వాహ‌నాన్ని ఓ జైషే అనుచ‌రుడు కొనుగోలు చేసిన‌ట్లు తెలుస్తోంది. జైషే స‌భ్యుడు స‌జ్జ‌ద్ భాట్ .. దాడి ఘ‌ట‌న త‌ర్వాత ప‌రారీలో ఉన్నాడు.

5262
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles