జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు విడుదల

Fri,June 14, 2019 11:22 AM

Jee Advanced Result 2019 Released Kartikey Gupta Topper

హైదరాబాద్‌ : జేఈఈ అడ్వాన్స్‌డ్‌ -2019 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ఐఐటీ రూర్కీ ఇవాళ ఉదయం విడుదల చేసింది. ఐఐటీల్లో ప్రవేశానికి గత నెల 27వ తేదీన నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలకు 1.65 లక్షల మంది హాజరయ్యారు. అయితే ఈ ఫలితాల్లో ఆల్‌ ఇండియా టాపర్‌గా మహారాష్ట్రకు చెందిన కార్తీకేయ గుప్తా నిలిచారు. సీట్ల కేటాయింపు జూన్‌ 19 నుంచి జులై 17వ తేదీ వరకు కొనసాగనుంది. ఫలితాల కోసం jeeadv.ac.in వెబ్‌సైట్‌ను లాగిన్‌ అవొచ్చు.

922
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles