సోమవారం కాదు.. ప్రమాణ స్వీకారం బుధవారం..!

Sat,May 19, 2018 11:21 PM

JDS Leader Kumaraswamy take oath on Wednesday as CM of Karnataka

బెంగళూరు: 4 రోజుల్లో అనేక మలుపులు తిరిగిన కర్ణాటక రాజకీయాలు చివరకు ఓ కొలిక్కి వచ్చాయి. సీఎం పదవికి యడ్యూరప్ప రాజీనామా చేయగానే కాంగ్రెస్, జేడీఎస్ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం చేసింది. వెంటనే జేడీఎస్ నేత కుమారస్వామి రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిశారు. కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని గవర్నర్‌కు తెలిపారు. వెంటనే గవర్నర్ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ - జేడీఎస్ కూటమిని ఆహ్వానించారు. దీంతో సోమవారం తాను సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు కుమార స్వామి ప్రకటించారు. పలు రాష్ర్టాల ముఖ్యమంత్రులను కూడా ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించనున్నట్లు కుమారస్వామి మీడియాతో తెలిపారు. కాని.. తాజాగా ప్రమాణ స్వీకారాన్ని సోమవారం కాకుండా బుధవారానికి అంటే మే 23 కు వాయిదా వేస్తున్నట్లు జేడీఎస్ ప్రకటించింది. బుధవారం మధ్యాహ్నం 12.30కు కుమారస్వామి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని జేడీఎస్ తెలిపింది. సోమవారం(మే 21)న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్థంతి కాబట్టి ఆ రోజును మార్చినట్లు వెల్లడించింది.
4063
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles