117 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది : కుమారస్వామి

Wed,May 16, 2018 05:56 PM

JDS and Congress have support 117 MLAs says Kumara Swamy

బెంగళూరు : కర్ణాటక గవర్నర్ వజుభాయ్ వాలాను జేడీఎస్ నాయకుడు కుమారస్వామి ఇవాళ సాయంత్రం రాజ్‌భవన్‌లో కలిశారు. కాంగ్రెస్ - జేడీఎస్ కూటమికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కల్పించాలని గవర్నర్‌ను కుమారస్వామి కోరారు. గవర్నర్‌ను కలిసిన అనంతరం కుమారస్వామి మీడియాతో మాట్లాడారు. 117 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు గవర్నర్‌కు లేఖ సమర్పించామని తెలిపారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సంఖ్యాబలం కాంగ్రెస్, జేడీఎస్‌కు ఉందన్నారు. బలనిరూపణకు అవసరమైన పత్రాలను గవర్నర్ కు సమర్పించామని చెప్పారు. కాంగ్రెస్, జేడీఎస్ ఐక్యంగా ఉన్నట్లు గవర్నర్‌కు స్పష్టం చేశామన్నారు. గవర్నర్ రాజ్యాంగానికి కట్టుబడి ఉంటారని నమ్ముతున్నామని చెప్పారు. రాజ్యాంగబద్ధంగా గవర్నర్ సరైన నిర్ణయం ప్రకటిస్తారని విశ్వసిస్తున్నామని తెలిపారు. గవర్నర్ నిర్ణయం తర్వాత భవిష్యత్ కార్యాచరణపై దృష్టి సారిస్తామని కుమారస్వామి పేర్కొన్నారు.

1584
Follow us on : Facebook | Twitter
Namasthe Telangana Property Show

More News

VIRAL NEWS

Namasthe Telangana Property Show

Featured Articles