జ‌య‌ల‌లిత మృతి.. ద‌ర్యాప్తు ఆపాల‌న్న సుప్రీంకోర్టు

Fri,April 26, 2019 01:02 PM

Jayalalithaa death inquiry put on hold by Supreme Court over Apollo petition

హైద‌రాబాద్: త‌మిళ‌నాడు మాజీ సీఎం జ‌య‌ల‌లిత మ‌ర‌ణం ప‌ట్ల ఓ క‌మిష‌న్ ద‌ర్యాప్తు చేప‌డుతున్న విష‌యం తెలిసిందే. అయితే ఆ ద‌ర్యాప్తు క‌మిష‌న్‌కు ఇవాళ సుప్రీంకోర్టు బ్రేక్‌లు వేసింది. 2016లో అపోలో హాస్ప‌ట‌ల్‌లో 75 రోజులు చికిత్స పొందిన త‌ర్వాత జ‌య మ‌ర‌ణించారు. ఆ కేసులో అపోలో డాక్ట‌ర్ల‌ను ఎంక్వైరీ క‌మిష‌న్ విచారిస్తున్న‌ది. దానిలో భాగంగానే డాక్ట‌ర్లకు ఆ క‌మిష‌న్ స‌మ‌న్లు జారీ చేసింది. హాస్ప‌ట‌ల్ రికార్డులు ఇవ్వాలంటూ డిమాండ్ చేసింది. ఈ నేప‌థ్యంలో అపోలో హాస్ప‌ట‌ల్ సుప్రీంకోర్టును ఆశ్ర‌యించింది. ద‌ర్యాప్తును నిలిపివేయాల‌ని కోర్టును కోరింది. చీఫ్ జ‌స్టిస్ రంజ‌న్ గ‌గోయ్ నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం అపోల్ వేసిన పిటీష‌న్‌ను అనుకూలంగా తీర్పునిచ్చింది. అపోలో అభ్య‌ర్థ‌న‌ను మ‌ద్రాసు హైకోర్టు తిర‌స్క‌రించ‌డంతో.. ఆ హాస్ప‌ట‌ల్ సుప్రీంకు వెళ్లాల్సి వ‌చ్చింది. జ‌య మ‌ర‌ణంపై విచార‌ణ చేప‌డుతున్న క‌మిష‌న్‌.. ఎంజీఆర్‌కు ఇచ్చిన చికిత్స వివ‌రాల‌ను కూడా కోరుతున్నద‌ని అపోలో కోర్టుకు విన్న‌వించింది.

1607
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles