ఓట్ల కోసం జవాన్లను చంపించారు.. పుల్వామా దాడి మోదీ పనే!

Thu,March 21, 2019 04:53 PM

Jawans were killed for Votes Pulwama attack a Conspiracy says SP leader Ramgopal yadav

లక్నో: సమాజ్‌వాదీ పార్టీకి చెందిన సీనియర్ నేత రామ్‌గోపాల్ యాదవ్ గురువారం దారుణమైన వ్యాఖ్యలు చేశారు. పుల్వామా ఉగ్రదాడిని ఓట్ల కోసం మోదీయే చేయించారని ఆయన విమర్శించారు. తమ రాజకీయ ప్రయోజనాల కోసం మోదీ సర్కార్ భద్రతా బలగాలను చంపించిందని ఆరోపించారు. మోదీపై పారా మిలిటరీ బలగాలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నాయని రాంగోపాల్ యాదవ్ చెప్పారు. పుల్వామా దాడి ఓ కుట్ర. జమ్ము-శ్రీనగర్ మధ్య అసలు ఎలాంటి తనిఖీలు చేయలేదు. జవాన్లను సాధారణ బస్సుల్లో పంపించారు అని ఆయన ఆరోపించారు. ఈ ఘటనపై తాను ఇంతకన్నా ఎక్కువగా ఏమీ మాట్లాడనని, ప్రభుత్వం మారితే దీనిపై విచారణ జరుపుతారని, అప్పుడు పెద్ద పెద్ద వాళ్లు ఇరుక్కుంటారని రాంగోపాల్ యాదవ్ అనడం విశేషం.


అయితే రాంగోపాల్ వ్యాఖ్యలపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రతా బలగాల ఆత్మైస్థెర్యం దెబ్బతీసేలా ఆయన మాట్లాడారని, దీనిపై ఆయన కచ్చితంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

3722
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles