ప్రాణాలకు తెగించి చిన్నారిని కాపాడాడు.. వీడియో

Wed,May 16, 2018 06:34 PM

Jawan saves girl from slipping under train in Mumbai

అది ముంబైలోని మహాలక్ష్మీ లోకల్ రైల్వే స్టేషన్. అప్పుడే లోకల్ ట్రెయిన్ వచ్చి ఆగింది. ప్రయాణికులంతా ట్రెయిన్ ఎక్కుతున్నారు. ఇంతలోనే ట్రెయిన్ కదిలింది. ఓ ఫ్యామిలీ కదులుతున్న ట్రెయిన్ ఎక్కబోయింది. వాళ్లలో ఓ చిన్నారి కూడా ఉంది. వాళ్లు ట్రెయిన్ ఎక్కి చిన్నారిని ఎక్కించబోయారు. చిన్నారి అదుపు తప్పింది. ట్రెయిన్ కింద పడబోయింది. అప్పుడే దేవుడిలా వచ్చాడు ఓ జవాన్. క్షణాల్లో అక్కడికి చేరుకొని చిన్నారి ప్రాణాలు కాపాడాడు. చిన్నారిని కాపాడే సమయంలో తను కూడా ట్రెయిన్ కింద పడబోయాడు. కాని.. సరైన బ్యాలెన్స్‌తో చిన్నారిని కాపాడి హీరో అయ్యాడు. ఇక.. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవడంతో ఏకంగా రైల్వే మంత్రి పియూష్ గోయల్ ఆ జవాన్‌ను పొగుడుతూ ట్వీట్ చేశాడు. మహారాష్ట్ర సెక్యూరిటీ ఫోర్స్‌కు చెందిన జవాన్ అతడు. మహాలక్ష్మీ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. చిన్నారిని కాపాడిన ఆ జవాన్‌ను నెటిజన్లు కూడా తెగ ప్రశంసిస్తున్నారు. ఆ జవాన్‌కు బ్రేవరీ అవార్డ్ ఇవ్వాలని ట్వీట్లు చేస్తున్నారు.
7261
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles