భీమవరం, గాజువాక నుంచి పవన్ పోటీ

Tue,March 19, 2019 01:19 PM

Janasena Chief Pawan Kalyan will contest from Bhimavaram and Gajuwaka

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసే స్థానాలపై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. భీమవరం(పశ్చిమ గోదావరి), గాజువాక(విశాఖ) నియోజకవర్గాల నుంచి పవన్ పోటీ చేయనున్నట్లు జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది. తాను పోటీ చేసే స్థానాలపై గంట తర్వాత వివరాలు చెప్తానని పవన్ మంగళవారం ఉదయం ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత విస్తృతంగా చర్చలు జరిపిన పార్టీ నాయకులు.. మొత్తానికి మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో పవన్ పోటీ చేసే స్థానాలను అధికారికంగా వెల్లడించారు. ఈ రెండు నియోజకవర్గాల్లో కాపు ఓటు బ్యాంకు పెద్ద సంఖ్యలో ఉండడంతో తనకు కలిసొచ్చే అంశంగా పవన్ భావిస్తున్నారు. భీమవరంలో 2004 నుంచి వరుసగా కాపు సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులే గెలుస్తూ వస్తున్నారు.

2009 సాధారణ ఎన్నికల్లో కూడా పవన్ అన్న చిరంజీవి రెండు చోట్ల నుంచి పోటీ చేశారు. సొంత జిల్లా పాలకొల్లులో ఓడిపోయిన చిరంజీవి.. తిరుపతిలో విజయం సాధించారు. ప్రస్తుత ఎన్నికల్లో భాగంగా పవన్ మూడు జాబితాల్లో 77 మంది అభ్యర్థులను ప్రకటించారు. పొత్తులో భాగంగా బీఎస్పీకి 21 అసెంబ్లీ స్థానాలు, 3 లోక్‌సభ స్థానాలను కేటాయించారు. సీపీఐ, సీపీఎంలకు ఏడేసి చొప్పున అసెంబ్లీ, రెండేసి లోక్‌సభ స్థానాలు కేటాయించారు.

1985
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles