పుల్వామాలో ఇద్ద‌రు ఉగ్ర‌వాదులు హ‌తం

Fri,June 14, 2019 04:18 PM

Jammu and Kashmir: 2 terrorists killed in encounter in Pulwama

హైద‌రాబాద్‌: జ‌మ్మూక‌శ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఇవాళ ఎన్‌కౌంట‌ర్ జ‌రిగింది. భ‌ద్ర‌తా ద‌ళాలు జ‌రిపిన కాల్పుల్లో ఇద్ద‌రు ఉగ్ర‌వాదులు హ‌త‌మ‌య్యారు. అవంతిపురా జిల్లాలోని బ్రా బందినా ఏరియాలో ఆప‌రేష‌న్ కొన‌సాగింది. ఉగ్ర‌వాదులు ఉన్న‌ట్లు ఇంటెలిజెన్స్ స‌మాచారం వ‌చ్చిన త‌ర్వాత సెర్చ్ ఆప‌రేష‌న్ మొద‌లుపెట్టారు. గాలింపు చేప‌ట్టిన స‌మ‌యంలో ఉగ్ర‌వాదులు కాల్పుల‌కు దిగారు. ఆ కాల్పుల‌ను సెక్యూర్టీ ద‌ళాలు తిప్పికొట్టాయి. కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన ఉగ్ర‌వాదుల‌ను ఇర్ఫాన్ అహ్మ‌ద్‌, త‌సాదుక్ షాలుగా గుర్తించారు. ఈ ఇద్ద‌రికీ ల‌ష్క‌రే తోయిబాతో సంబంధాలు ఉన్నాయి.

964
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles