జల్ బచావో, వీడియో బనావో, పురస్కార్ పావో

Wed,July 11, 2018 06:13 PM

Jal Bachao Video Banao Puruskar Pao Contest on Water Conservation

న్యూఢిల్లీ: జలవనరుల పరిరక్షణ, నీటి పొదుపుపై కేంద్ర జలవనరులశాఖ వీడియో కాంటెస్ట్‌ను నిర్వహిస్తోంది. జల్ బచావో, వీడియో బనావో, పురస్కార్ పావో స్లోగన్‌తో వీడియోలను ఆహ్వానిస్తుంది. కేంద్ర ప్రభుత్వ మై గౌట్ పోర్టల్ ద్వారా సంబంధిత మంత్రిత్వశాఖ పోటీదారులను ఆహ్వానిస్తుంది. నవంబర్,2018 వరకు నిర్వహించే ఈ పోటీల్లో ప్రతీ పదిహేను రోజులకోసారి ముగ్గురు విజేతలను ప్రకటించనుంది. భారతీయ పౌరులెవరైనా www.mygov.in కు లాగిన్ అయి MyGov కంటెస్ట్ పేజీలో వీడియోలు అప్‌లోడ్ చేయాల్సిందిగా సూచించింది.

సహజత్వం, సృజనాత్మకత, సాంకేతికత, నటనా విధానం, వీడియో స్పష్టత అంశాల ఆధారంగా విజేతలను ప్రకటించనున్నట్లు తెలిపింది. ప్రథమ బహుమతిగా రూ. 25 వేలు, రూ. ద్వితీయ బహుమతి 15 వేలు, తృతీయ బహుమతి రూ. 10 వేలు అందజేయనుంది. నీటి పొదుపుపై తీసిన అడ్వైర్టెజ్‌మెంట్, కమర్షియల్‌ను కూడా పంపొచ్చని తెలిపింది. వీడియో వ్యవధి 2 నిమిషాలకు తగ్గకుండా.. 10 నిమిషాలకు మించకుండా ఉండాలంది. హిందీ, ఇంగ్లీష్‌తో పాటు ఇతర ప్రాంతీయ భాషాల్లో వీడియోలు తీసి అప్‌లోడ్ చేయవచ్చు. మేథో సంపత్తి హక్కులు, ఇండియన్ కాపీరైట్ యాక్ట్,1957ను ఉల్లంఘించకుండా ఉండాలని పేర్కొంది.

1286
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles