జైల్లో చికెన్ పెట్టడం లేదు.. గ్యాంగ్‌స్టర్ ఫిర్యాదు!

Wed,June 13, 2018 01:08 PM

Jail Authorities not giving Chicken Gangster Abu Salem complains to Portuguese officials

ముంబై: జీవితఖైదు అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్ అబు సలెం తన ఫిర్యాదుల చిట్టా విప్పాడు. తనను చూడటానికి వచ్చిన పోర్చుగీస్ అధికారుల ముందు తన బాధలు చెప్పుకున్నాడు. జైలు అధికారులు చికెన్ ఇవ్వడం లేదని, తనను పూర్తిగా వెజిటేరియన్‌గా మార్చేశారని ఫిర్యాదు చేశాడు. తరచూ తాను అనారోగ్యానికి గురవుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని అన్నాడు. తనకు ప్రాణహాని ఉందని చెప్పడంతో పోర్చుగీస్ అధికారులు అబు సలెంను కలవడానికి వచ్చారు.

ఈ సందర్భంగా తలోజా జైల్లో శిక్ష అనుభవిస్తున్న సలెం.. తాను పడుతున్న ఇబ్బందులను వాళ్లకు వివరించారు. జైళ్ల శాఖ ఐజీతోపాటు డాక్టర్లు, తలోజా జైలు ఎస్పీ, ఓ సీబీఐ ఆఫీసర్, సలెం తరఫున లాయర్ ఈ సమావేశంలో ఉన్నారు. జైల్లో అసలు నాణ్యమైన భోజనం పెట్టడం లేదని సలెం చెప్పినట్లు అతని తరఫు లాయర్ సబా ఖురేషీ వెల్లడించారు. అతని సెల్‌లో సరైన వెలుతురు లేదు. టాయిలెట్ సరిగా లేదు. వాటి వల్ల అతడు తరచూ అనారోగ్యానికి గురవుతున్నాడు. అతనికి మోకాలి, కళ్ల సమస్యలు ఉన్నాయి. ముంబైలో ఓ డాక్టర్‌కు చూపించాలని చెప్పినా.. అతని వెంట పంపించడానికి సరిపడా గార్డులు లేరంటూ ఏడాదిగా నాన్చుతున్నారు అని ఆమె చెప్పారు.

అయితే జైలు ఎస్పీ సదానంద్ గైక్వాడ్ మాట్లాడుతూ.. అతనికి మేం చికెన్ ఇవ్వలేం. ఓ డాక్టర్ ఎవరికైనా గుడ్లు ఇవ్వాలని సూచిస్తే వాళ్లకు ఇస్తాం. అతనికి కావాలంటే క్యాంటీన్‌లో గుడ్లు కొనుక్కోవచ్చు. ఇలాటి బరాక్‌లోనే చాలా మంది ఖైదీలు ఉంటున్నారు. వాళ్లెప్పుడూ ఫిర్యాదులు చేయలేదు. అతడెప్పుడూ ఆరోగ్యం గురించి ఏదో ఒక ఫిర్యాదు చేస్తూనే ఉంటాడు అని చెప్పారు. ఇక పోర్చుగల్ అబు సలెంను భారత్‌కు అప్పగించే సమయంలో చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నారని, అతనికి 25 ఏళ్ల కంటే ఎక్కువ జైలు శిక్ష వేయకూడదన్న నిబంధన ఉన్నా.. జీవితఖైదు వేశారని అతని లాయర్ సబా ఖురేషీ ఆరోపించారు.

2816
Follow us on : Facebook | Twitter
Namasthe Telangana Property Show

More News

VIRAL NEWS