విద్యుత్ రంగంలో ఎన్నో విజయాలు: జగదీష్‌రెడ్డి

Thu,December 7, 2017 01:43 PM

Jagadish Reddy Says Current Producing in Telangana


న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో విద్యుత్‌రంగంలో రాష్ట్రప్రభుత్వం ఎన్నో విజయాలు సాధించిందని మంత్రి జగదీష్‌రెడ్డి తెలిపారు. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్‌కే సింగ్ అధ్యక్షతన జరుగుతున్న పవర్, నూతన ఉత్పాదక సదస్సులో మంత్రి జగదీష్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు జనవరి 1 నుంచి వ్యవసాయానికి 24 గంటల కరెంట్ అందిస్తున్నట్లు చెప్పారు. పగటిపూట 9గంటలు వ్యవసాయానికి విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని స్పష్టం చేశారు. వివిధ రాష్ర్టాల్లో జరుగుతున్న విద్యుత్ ఉత్పత్తిపై సదస్సులో చర్చించినట్లు వెల్లడించారు. పునరుత్పాదక విద్యుత్, విద్యుత్ తయారీ ప్రధాన అంశాలుగా చర్చ జరిగినట్లు తెలిపారు. అందరికీ విద్యుత్ ఇవ్వాలన్నదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు.
Jgd-conf2
Jgd-conf1

1240
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS