ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చాక్లెట్‌ ఇదే..!

Wed,October 23, 2019 11:41 AM

న్యూఢిల్లీ: బహుళ వ్యాపార దిగ్గజం 'ఐటీసీ' గ్రూప్ మంగళవారం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చాక్లెట్‌ను ఆవిష్కరించింది. తమ లగ్జరీ చాక్లెట్ బ్రాండ్.. ఫాబెల్లీ ద్వారా దీన్ని పరిచయం చేసింది. ట్రినిటీ-ట్రఫ్లెస్ ఎక్స్‌ట్రార్డినెయిర్ పేరుతో వచ్చిన ఈ చాక్లెట్ కిలో ధర రూ.4.3 లక్షలు. దీంతో ఈ చాక్లెట్ గిన్నిస్ బుక్ రికార్డుల్లో నిలిచింది. దీనికోసం ఫ్రాన్స్ స్టార్ చెఫ్ ఫిలిప్పే కాంటిసిని సాయం తీసుకున్నట్లు ఐటీసీ ప్రకటించింది. ఈ లిమిటెడ్ ఎడిషన్ చాక్లెట్లను ఆర్డర్ చేసుకున్న వారికి చేతులతో చెక్కిన ప్రత్యేక చెక్క బాక్స్‌లో అందిస్తున్నామని, ప్రతీ బాక్స్‌లో 15 గ్రాముల 15 చాక్లెట్లు ఉంటాయని ఐటీసీ ఫుడ్ డివిజన్ సీవోవో అనుజ్ రుస్తగి తెలిపారు. అన్ని పన్నులతో కలిపి ఈ బాక్స్ ధర లక్ష రూపాయలన్నా రు. ఒక్కో చాక్లెట్ రూ.6,670 పలుకుతున్నది.964
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles