ఐటీ అధికారులు తనిఖీలు చేయడానికి వెళ్తే..

Thu,October 11, 2018 06:07 PM

IT officials beaten up during raids in madhyapradesh

మధ్యప్రదేశ్: ఓ ఆయిల్ మిల్లు యజమాని ఆదాయపన్ను శాఖ అధికారులపై దాడి చేశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని మోరెనా పట్టణంలో జరిగింది. పన్నులు ఎగ్గొట్టి ఉంటారన్న అనుమానంతో ఐటీ అధికారులు జివాజీ గంజ్ ప్రాంతంలోని సూరజ్‌భన్ ఆయిల్ మిల్లు యజమాని గోవింద్ బన్సాల్ ఇంట్లో తనిఖీలు చేసేందుకు వెళ్లారు. అధికారులు తనిఖీలు కొనసాగిస్తుండగా..గోవింద్ బన్సాల్‌తోపాటు అతని కుటుంబసభ్యులు వారిపై దాడి చేశారు.

అక్కడికి చేరుకున్న పోలీసులు విధులకు ఆంటకం కలిగించి ఐటీ అధికారులపై దాడి చేసిన గోవింద్ బన్సాల్ అతని కుటుంబసభ్యులపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. గోవింద్ బన్సాల్ పలు కీలక పత్రాలు, నగదు, ఆభరణాలను ఐటీ అధికారుల నుంచి దొంగిలించేందుకు ప్రయత్నించారని, ఐటీ టీం వెయ్యి పేజీలతో కూడిన పత్రాలను గుర్తించిందని, అవి పన్ను ఎగవేతకు సంబంధించినవిగా అనుమానిస్తున్నామని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

3446
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles