మా ఎమ్మెల్యేలను కొనడం అంత ఈజీ కాదు..

Fri,May 3, 2019 11:45 AM

it is not easy to buy APP MLAs says CM Kejriwal

న్యూఢిల్లీ : 14 మంది ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని కేంద్ర మంత్రి విజయ్ గోయల్ చేసిన వ్యాఖ్యలపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనడం అంత ఈజీ కాదని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ఎక్కడిదాకా వచ్చింది? మీరు ఎంత ఇస్తున్నారు? మా ఎమ్మెల్యేలు ఎంత డిమాండ్ చేస్తున్నారు? అని గోయల్‌ను కేజ్రీవాల్ ప్రశ్నించారు. ఆయా రాష్ర్టాల్లో మీ వ్యతిరేక పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి.. ఆయా రాష్ర్ట ప్రభుత్వాలను కూలదోయడమే మీ లక్ష్యమా? అని మోదీని కేజ్రీవాల్ ప్రశ్నించారు. మీ దృష్టిలో ప్రజాస్వామ్యం అంటే అర్థం ఇదేనా? ఎమ్మెల్యేల కొనుగోలుకు డబ్బులు ఎక్కడి నుంచి తెస్తున్నారు? అని కేజ్రీవాల్ ప్రశ్నల వర్షం కురిపించారు. చాలాసార్లు తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నం చేశారు కానీ.. అది అంత సులభం కాదని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాలకు మే 12వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఆప్ ఒంటరిగానే పోటీ చేస్తుంది.

1750
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles