Telangana Intermediate 1st & 2nd Year Results 2019

రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రూ.225 కోట్ల ఆస్తులు అటాచ్

Wed,March 20, 2019 04:26 PM

IT DEPT attaches Rs.225 cr assets of retired UP IAS officer


న్యూఢిల్లీ: ఆదాయ పన్ను శాఖ ఉత్తరప్రదేశ్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారికి చెందిన ఆస్తులను అటాచ్ చేసింది. పన్ను ఎగవేత కేసుకు సంబంధించిన విచారణ జరుగుతున్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నెట్ రామ్‌తోపాటు ఆయన సహాయకులకు చెందిన రూ.225 కోట్ల విలువైన ఆస్తులను ఐటీ అధికారులు అటాచ్ చేశారు. ఐటీ యాక్ట్‌లోని సెక్షన్ 132 (9బీ) కింద ఢిల్లీ, ముంబై, నోయిడా, కోల్‌కతా, లక్నోలోని 20 రకాల స్థిరాస్తులను అటాచ్ చేశారు. మాయావతి సీఎంగా ఉన్న కాలంలో వివిధ ఉన్నతస్థాయి హోదాల్లో పనిచేసిన నెట్ రామ్ నివాసంపై గత వారం ఐటీ అధికారులు దాడులు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో నెట్ రామ్ నివాసంలో ఉన్న 3 లగ్జరీ కార్లు, రూ.1.64 కోట్ల నగదు, నాలుగు లగ్జరీ ఎస్‌యూవీ కార్లతోపాటు రూ.300 కోట్ల బినామి ఆస్తులకు సంబంధించిన పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

2412
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles