దూసుకెళ్లిన‌ జీశాట్‌-29

Wed,November 14, 2018 05:25 PM

ISRO launched advanced communication satellite GSAT 29 from Sriharikota

శ్రీహ‌రికోట: జీశాట్-29 ఉప‌గ్ర‌హం ఇవాళ నింగిలోకి ఎగిరింది. జీఎస్ఎల్‌వీ మార్క్ డీ2 రాకెట్ ద్వారా దీన్ని ప్ర‌యోగించారు. జీశాట్‌29ను విజ‌య‌వంతంగా క‌క్ష్య‌లో ప్ర‌వేశ‌పెట్టారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని శ్రీహ‌రికోట నుంచి సాయంత్రం 5.08 నిమిషాల‌కు దీన్ని ప్ర‌యోగించారు . 3423 కిలో బ‌రువున్న ఉప‌గ్ర‌హాల‌ను జీశాట్ మోసుకెళ్లుతున్న‌ది. జియోసింక్రోన‌స్ ట్రాన్స్‌ఫ‌ర్ ఆర్బిట్‌లో జీశాట్ 29ను ఉంచ‌నున్నారు. ఎస్‌200 బూస్ట‌ర్ ద్వారా ప్ర‌యోగాన్ని స‌క్సెస్‌ఫుల్‌గా నిర్వ‌హించారు. జీశాట్ 29.. మ‌ల్టీబీమ్‌, మ‌ల్టీబ్యాండ్ క‌మ్యూనికేష‌న్ శాటిలైట్‌. జీఎస్ఎల్వీ మార్క్ 3 ఇస్రోకు చెందిన అయిద‌వ జ‌న‌రేష‌న్‌కు సంబంధించిన వాహ‌క నౌక‌.మంగళవారం మధ్యాహ్నం 2.50 గంటలకు 27 గంటల కౌంట్‌డౌన్ ప్రారంభమైన విష‌యం తెలిసిందే. జీఎస్‌ఎల్వీ-ఎంకేఐఐ డీ2 వాహక నౌక ద్వారా జీశాట్-29 ఉపగ్రహాన్ని ప్రయోగించారు. ఇస్రో చైర్మన్ కే శివన్ ఈ ప్ర‌యోగాన్ని ప్ర‌త్య‌క్షంగా వీక్షించారు. ఆయ‌న‌ మంగళవారం తిరుమలలో శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈశాన్య రాష్ట్రాలు, జమ్ముకశ్మీర్ ప్రజల కమ్యూనికేషన్ అవసరాలు తీర్చేందుకు ఇస్రో ఈ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపింది. భారత అంతరిక్ష పరిశోధనలో జీశాట్-29 ఉపగ్రహ ప్రయోగం కీలక మైలు రాయి కానున్నదని శివన్ తెలిపారు. జీశాట్ స‌క్సెస్ క్రెడిట్ అంతా ఇస్రో స‌భ్యుల‌కు ద‌క్కుతుంద‌ని చైర్మ‌న్ శివ‌న్ అన్నారు.


1583
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles