చంద్రుడి ద‌క్షిణ ద్రువంపై దిగ‌నున్న విక్ర‌మ్ ల్యాండ‌ర్ !

Sat,May 11, 2019 11:31 AM

ISRO aims to land Vikram in unexplored lunar south pole

హైద‌రాబాద్‌: చంద్ర‌యాన్‌-2 జూలైలో నింగికి ఎగిరే అవ‌కాశాలున్న‌ట్లు ఇటీవ‌ల ఇస్రో చైర్మ‌న్ వెల్లడించిన విష‌యం తెలిసిందే. చంద్రుడి మీద‌కు ప్ర‌యోగిస్తున్న చంద్ర‌యాన్‌-2.. భార‌త్‌కు చెందిన‌ మొత్తం 14 పేలోడ్స్‌ను మోసుకువెళ్ల‌నున్న‌ది. చంద్ర‌యాన్ స్పేస్‌క్రాఫ్ట్ సుమారు 3800 కేజీల బ‌రువు ఉంటుంది. చంద్రుడికి 100 కిలోమీట‌ర్ల దూరంలో చంద్ర‌యాన్ చ‌క్క‌ర్లు కొట్ట‌నున్న‌ది. సెప్టెంబ‌ర్ 6వ తేదీన ల్యాండ‌ర్ విక్ర‌మ్‌.. చంద్రుడిపై ల్యాండ్ అవుతుంద‌ని ఇస్రో వ‌ర్గాలు వెల్ల‌డించాయి. విక్ర‌మ్ ల్యాండ‌ర్‌తో పాటు ప్ర‌జ్ఞాన్ రోబ‌టిక్ రోవ‌ర్ కూడా చంద్రుడిపై దిగ‌నున్న‌ది. చంద్రుడిపై దక్షిణ ద్రువంలో విక్ర‌మ్ ల్యాండ‌ర్‌ను దించాల‌ని ఇస్రో శాస్త్ర‌వేత్త‌లు భావిస్తున్నారు. ద‌క్షిణ ద్రువంలో ఎక్కువగా ప‌రిశోధ‌న‌లు జ‌ర‌గ‌ని ప్ర‌దేశంలో ల్యాండ్ చేయాల‌నుకుంటున్నారు. ఒక‌వేళ ల్యాండింగ్ ప్ర‌క్రియ‌ స‌క్సెస్ అయితే, అప్పుడు విక్ర‌మ్ ల్యాండ‌ర్‌ను సౌత్ పోల్‌లోనే దించుతారు. ఎంకే త్రీ హెవీ బూస్ట‌ర్ ద్వారా శ్రీహ‌రికోట నుంచి చంద్ర‌యాన్ మిష‌న్‌ను ప్ర‌యోగించ‌నున్నారు. 2008లో చంద్ర‌యాన్‌-1 మిష‌న్‌ను పీఎస్ఎల్వీ బూస్ట‌ర్ ద్వారా ప్ర‌యోగించారు. అప్పుడు అది 11 పేలోడ్స్‌ను మోసుకువెళ్లింది. అమెరికాకు చెందిన ఓ పేలోడ్ ద్వారా చంద్రుడిపై నీరు ఉంద‌న్న ఆధారాలు కూడా స్ప‌ష్ట‌మైన విష‌యం తెలిసిందే.

1955
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles