ఈశ్వ‌ర్ చంద్ర విద్యాసాగ‌ర్ ప్ర‌త్యేక‌త ఏమిటి ?

Wed,May 15, 2019 03:36 PM

Ishwar Chandra Vidyasagar revolutionised Bengali education system

హైద‌రాబాద్: బెంగాల్‌లో మంగ‌ళ‌వారం బీజేపీ, తృణ‌మూల్ కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య జ‌రిగిన హింస‌లో ఈశ్వ‌ర్ చంద్ర విద్యాసాగ‌ర్ విగ్ర‌హం ధ్వంస‌మైంది. ఇంత‌కీ ఈశ్వ‌ర్ చంద్ర విద్యాసాగ‌ర్ ఎవ‌రో తెలుసా మీకు. ఆయ‌నో గొప్ప ర‌చ‌యిత‌. సంఘ సంస్క‌ర్త‌. విద్యావ్య‌వ‌స్థ అభివృద్ధికి ఎంతో తోడ్ప‌డ్డారు. మ‌హిళ‌ల సాధికార‌త‌ కోసం కూడా ఆయ‌న ప‌నిచేశారు. ఆయ‌న గురించి మ‌రికొన్ని అంశాలు ఇవే..

1820, సెప్టెంబ‌ర్ 26న ఓ బ్రాహ్మ‌ణ కుటుంబంలో పుట్టారు. చిన్న‌త‌నంలోనే చ‌దువంటే అమిత‌మైన ఆస‌క్తి. వీధిదీపాల కింద అత‌ను విద్య‌ను అభ్య‌సించాడు. గ్రామీణ పాఠ‌శాల‌లో సంస్కృత భాష‌ను నేర్చుకున్నారు. విద్యాసాగ‌ర్ గురించి ఎన్నో క‌థ‌లు ప్ర‌చారంలో ఉన్నాయి. రోడ్డు వెంట రాసి ఉండే మైలురాళ్ల‌పై ఉన్న అంకెల‌ను చూసి ఇంగ్లీష్ న్యూమ‌రిక‌ల్స్ నేర్చుకున్నాడ‌ట‌. సంస్కృతం కాలేజీలో 1829 నుంచి 1841 వ‌ర‌కు ఆయ‌న వేదాలు, వ్యాక‌ర‌ణం, సాహిత్యం నేర్చుకున్నారు. 1839లో ఆయ‌న సంస్కృత భాషలో కాంపిటీష‌న్ టెస్టింగ్ నాలెడ్జ్ ప‌రీక్ష‌కు హాజ‌ర‌య్యారు. అక్క‌డే ఆయ‌న‌కు విద్యాసాగ‌ర్ అన్న బిరుదు ద‌క్కింది. ఆయ‌నకు స‌ముద్ర‌మంత జ్ఞానం ఉంద‌ని అంటారు.

1839లో ఆయ‌న న్యాయ ప‌రీక్ష‌లో పాస‌య్యారు. 1841లో 21 ఏళ్ల వ‌య‌సులోనే ఆయ‌న ఫోర్ట్ విలియ‌మ్ కాలేజీలో సంస్కృత భాష డిపార్ట్‌మెంట్‌కు అధిప‌తిగా చేశారు. ర‌చ‌యిత‌గా, త‌త్వ‌వేత్త‌గా, మాన‌వ‌తావాదిగా ఆయ‌న‌కు గుర్తింపు వ‌చ్చింది. ఆనాటి రోజుల్లో బ్రిటీష్ అధికారులు ఆయ‌న్ను గౌర‌వించేవారు. బెంగాల్ విద్యావ్య‌వ‌స్థ‌లో ఈశ్వ‌ర్ చంద్ర విప్ల‌వం తీసుకువ‌చ్చారు. బెంగాల్ భాష‌ను రాసే, నేర్పే ప‌ద్ధ‌తుల‌ను ఆయ‌న మ‌రింత రిఫైన్ చేశారు. బెంగాలీ అక్ష‌ర‌మాల‌కు ఇప్ప‌టికీ ఆయ‌న రాసిన పుస్త‌కాన్నే ప్రామాణికంగా తీసుకుంటారు.

బాలిక విద్య గురించి ఆయ‌న విశేష కృషి చేశారు. 19వ శ‌తాబ్ధం ఆరంభంలో బాలిక‌ల కోసం ప్ర‌త్యేక స్కూళ్ల‌ను తెరిపించారు. దిగువ కులాల‌కు చెందిన వారి కోసం కూడా ఆయ‌న సంస్కృత భాష కాలేజీని ప్రారంభించారు. కులం, మ‌తం, ఆడ‌, మ‌గ తేడా లేకుండా విద్య‌ను అభ్య‌సించాల‌న్న‌ది ఆయ‌న ఉద్దేశం. వితంతువుల‌కు మ‌ళ్లీ వివాహం చేయాల‌న్న నినాదాన్ని ఆయ‌న బలంగా వినిపించారు. బెంగాలీ అక్ష‌ర‌మాల‌లో 12 ఓవ‌ల్స్‌, 40 కాన్‌సోనెంట్స్ ఉండేలా వ‌ర్ణ‌మాల భాష‌ను రూపొందించారు. ఆయ‌న రాసిన అనేక పుస్త‌కాలు బెంగాల్ విద్యా వ్య‌వ‌స్థ‌కు ఎంతో ఉప‌క‌రించాయి. 1891, జూలై 29న‌ ఆయ‌న తనువు చాలించారు.

1328
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles