కరుణానిధి కన్నా సీఎం పళనిస్వామి గొప్పవాడా ?

Tue,August 14, 2018 07:08 AM

Is Palanisamy bigger than Karunanidhi, Jayalalithaa, asks Rajinikanth

చెన్నై: తమిళనాడు సీఎం పళనిస్వామిపై ఫిల్మ్‌స్టార్ రజనీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల మరణించిన డీఎంకే ప్రెసిడెంట్ కరుణానిధి అంత్యక్రియలు మెరీనా బీచ్‌లో జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆ అంత్యక్రియలకు సీఎం పళనిస్వామి హాజరుకాలేదు. సోమవారం జరిగిన నివాళి కార్యక్రమంలో రజనీకాంత్ ఈ విషయాన్ని ప్రస్తావించారు. కరుణకు తుది వీడ్కోలు ప‌లికేందుకు ఎంతో మంది నేతలు మెరీనా బీచ్‌కు వచ్చారు. కానీ సీఎం పళిని అక్కడకు రాలేదు. కరుణానిధి, జయలలిత కన్నా పళనిస్వామి గొప్పవాడా అని రజనీకాంత్ ప్రశ్నించారు. కరుణ లేని తమిళనాడును ఊహించలేకపోతున్నాని ఆయన అన్నారు. ఎన్నో విజయాలను, అపజయాలను, మోసాలను కరుణ ఎదుర్కొన్నారని, దేశవిదేశాల నుంచి నేతలు తమిళనాడుకు వస్తే, వాళ్లు కచ్చితంగా కరుణను కలిసేవారని, ఇప్పుడు వాళ్లు ఎవర్ని కలుస్తారో అర్థం కావడం లేదని రజనీ అన్నారు. ఆగస్టు 8వ తేదీన మెరీనా బీచ్‌లో కరుణ ఖననం జరిగింది.

2429
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS