త్వ‌ర‌లో ఐర‌న్ లేడీ ష‌ర్మిళ‌ పెళ్లి

Thu,July 13, 2017 02:43 PM

Iron lady Irom Sharmila to tie the knot soon

కొడైకెనాల్: ఐర‌న్ లేడీ ఇరోమీ ష‌ర్మిళ పెళ్లి దాదాపు ఫిక్స్ అయ్యింది. స‌బ్‌రిజిస్ట్రార్ ఆఫీసులో ఆమె మ్యారేజ్ అప్లికేష‌న్ పెట్టుకున్న‌ది. త‌న బ్రిటీష్ స్నేహితుడు డెస్మండ్ కౌటినోను ఆమె పెళ్లి చేసుకోనున్న‌ది. మ‌ణిపూర్‌లో ఆర్మీ ప్ర‌త్యేక చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా పోరాడిన ష‌ర్మిళ వివాహం మ‌రో నెల రోజుల త‌ర్వాత జ‌రిగే వీలు ఉన్న‌ది. త‌మిళ‌నాడులోని కొడైకెనాల్‌లో ఉన్న రిజిస్ట్రార్ ఆఫీసులో ఆమె పెళ్లి ద‌ర‌ఖాస్తు చేసుకున్న‌ది. కులాంత‌ర వివాహం కావ‌డం వ‌ల్ల హిందూ మ్యారేజ్ చ‌ట్టం ప్ర‌కారం అప్లికేష‌న్‌ను ఫైల్ చేశారు. ఆ అప్లికేష‌న్‌ను 30 రోజుల పాటు నోటీస్‌లో ఉంచుతారు. మ‌ణిపూర్ ఎన్నిక‌ల్లో దారుణంగా ఓడిన ష‌ర్మిళ ఇటీవ‌ల కొడైకెనాల్‌కు చేరుకుని అక్క‌డ స్నేహితుడితో ఉంటున్న‌ది.

1780
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles