కవలలకు జన్మనిచ్చిన ఇరోమ్ షర్మిల

Mon,May 13, 2019 06:41 PM

iron lady Irom Sharmila delivers twin girls in Bengaluru

ఉక్కు మహిళ, మణిపూర్‌ పౌర హక్కుల కార్యకర్త ఇరోమ్‌ షర్మిల కవలలకు జన్మనిచ్చారు. బెంగళూరు మల్లేశ్వరంలోని క్లౌడ్‌నైన్‌ గ్రూప్‌ హాస్పటల్స్‌లో ఇరోమ్‌ షర్మిలకు పండంటి కవల ఆడపిల్లలు పుట్టారు. మే 12న మదర్స్‌ డే సందర్భంగా ఇరోమ్‌ షర్మిలకు కవలలు పుట్టడం విశేషం. కవలలిద్దరికీ నిక్స్‌ శక్తి, ఆటామన్‌ తారా అని నామకరణం చేశారు. తల్లీపిల్లలిద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని డాక్టర్‌ శ్రీప్రద వినేకర్‌ తెలిపారు. 2017 ఆగస్టు 17న ఇరోమ్‌ షర్మిల, బ్రిటీష్‌ పౌరుడు డెస్మండ్‌ కౌటినోను పెళ్లి చేసుకున్నారు.

16 ఏళ్ల పాటు సాయుధ బ‌ల‌గాల ప్ర‌త్యేకాధికారాల చ‌ట్టానికి వ్య‌తిరేకంగా నిరాహార దీక్ష చేసిన ఇరోమ్ షర్మిల 2016లో దీక్ష విర‌మించారు. ఆ త‌ర్వాత పీపుల్స్ రిస‌ర్జెన్స్ అండ్ జ‌స్టిస్ అల‌యెన్స్ పార్టీని స్థాపించి క్రియాశీల రాజ‌కీయాల్లోకి వచ్చారు. అయితే ఇరోమ్ షర్మిల ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చవిచూశారు.

2293
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles