జులైలో ఇరోమ్ ష‌ర్మిల పెళ్లి

Mon,May 8, 2017 03:21 PM

Irom Sharmila to marry his Long time British Partner Desmond in July

ఇంఫాల్‌: మ‌ణిపూర్ ఉక్కు మ‌హిళ ఇరోమ్ ష‌ర్మిల జులైలో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న‌ది. బ్రిటన్‌కు చెందిన డెస్మండ్ కౌటినోతో ఆమె ఏడ‌డుగులు వేయ‌నుంది. త‌మిళ‌నాడులో పెళ్లి చేసుకోవాల‌ని ఆమె భావిస్తున్న‌ది. అయితే పెళ్లి తేదీని మాత్రం ఇంకా నిర్ణ‌యించ‌లేదు. పెళ్లి తంతు నిర్వహణకు సంబంధించి ఇటీవల వీరిద్దరు మదురైని సందర్శించారు. 2011లో తొలిసారి వీరు కలుసుకున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత మూడు ముళ్లబంధంతో ఒక్కటి కావాలని చూస్తున్నారు. మణిపూర్‌లో ప్రత్యేక సైనికాధికారాల చట్టానికి వ్యతిరేకంగా 16 ఏళ్ల‌పాటు నిరవధిక నిరాహార దీక్ష చేసిన షర్మిల ఇక చట్టసభల్లో పోరాడుతానని ప్రకటించి గత ఏడాది ఆగస్టులో దీక్షను విరమించారు. ఇటీవల మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి ఘోరంగా ఓడిపోయారు. ఇక తాను దక్షిణభారత దేశానికి వెళ్లి ప్రశాంత జీవనం గడుపాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్న ఆమె ఇప్పుడు తన పెళ్లితో వార్తల్లో నిలిచారు. పెళ్లి త‌ర్వాత కూడా ఆ చ‌ట్టానికి వ్య‌తిరేకంగా తాను పోరాటం కొన‌సాగిస్తాన‌ని ష‌ర్మిల స్ప‌ష్టంచేశారు. ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌కున్నా.. అంత‌ర్జాతీయ సంస్థ‌ల‌ను క‌లిసి ఈ చ‌ట్టం ర‌ద్దుకు కేంద్రంపై ఒత్తిడి తేవాల‌ని ష‌ర్మిల భావిస్తున్నది.

934
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles