మూడు టికెట్లు రద్దు చేస్తారా.. 45 వేలు పరిహారం ఇవ్వండి!

Thu,November 22, 2018 01:31 PM

IRCTC told to pay hefty fine for cancelling 3 reserved tickets

న్యూఢిల్లీ: ఓ ప్రయాణికుడు బుక్ చేసుకున్న మూడు టికెట్లను అతనికి తెలియకుండా రద్దు చేసిన ఇండియన్ రైల్వేస్ కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ)ను రూ.45 వేలు పరిహారం చెల్లించాలని ఓ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార ప్యానెల్ ఆదేశించింది. ఓ థర్ట్ పార్టీ మెయిల్‌ను ఆధారంగా చేసుకొని ప్రయాణికుడికి తెలియకుండా ఐఆర్‌సీటీసీ మూడు రిజర్వ్ అయిన టికెట్లను రద్దు చేసింది. కేవలం టికెట్ల డబ్బులు వెనక్కి ఇస్తే సరిపోదని, పరిహారం కూడా ఇవ్వాల్సిందేనని వినియోగదారుల ఫోరమ్ స్పష్టం చేసింది. రోహిత్ శర్మ అనే ఓ వ్యక్తి అభ్యర్థన మేరకు తాము ఆ మూడు టికెట్లను రద్దు చేసినట్లు ఐఆర్‌సీటీసీ కూడా అంగీకరించింది. సుశోవన్ గుప్తా రే అనే వ్యక్తి సెల్దా నుంచి న్యూఢిల్లీకి వెళ్లడానికి తన కుటుంబం కోసం మూడు టికెట్లు బుక్ చేసుకున్నాడు.

అయితే ప్రయాణం చేయాల్సిన రోజు మీ టికెట్లు రద్దయినట్లుగా ఐఆర్‌సీటీసీ నుంచి మెయిల్ రావడం చూసి అతను షాక్ తిన్నాడు. ఏం జరిగిందని ఆరా తీయగా.. రోహిత్ శర్మ అనే వ్యక్తి సూచన మేరకు రద్దు చేసినట్లు తేలింది. అతనెవరో తనకు తెలియదని, టికెట్లు రద్దు చేయడం వల్ల తనకు నష్టం జరిగిందని ఫిర్యాదు చేశాడు. అంతేకాదు రైలు టికెట్లు రద్దవడంతో అప్పటికప్పుడు విమానంలో వెళ్లాల్సి వచ్చింది. దీనికోసం రూ.20 వేలకుపైగా ఖర్చయింది. అయితే ఇందులో తమ తప్పేమీ లేదని, టికెట్లు రద్దయిన తర్వాత ఆ డబ్బును తిరిగిన ఆయనకు చెల్లించామని ఐఆర్‌సీటీసీ వాదించింది. అయితే ఫోరమ్ మాత్రం పరిహారం చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది.

2569
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles