ఐఫోన్ 7పై భారీ డిస్కౌంట్‌!

Sat,November 19, 2016 01:59 PM

న్యూఢిల్లీ: ఆపిల్ అభిమానుల‌కు గుడ్‌న్యూస్‌. సిటీబ్యాంక్ కార్డులు ఉన్న క‌స్ట‌మ‌ర్ల‌కు ఐప్యాడ్‌, ఐఫోన్ లేటెస్ట్ మోడ‌ల్స్‌పై భారీ డిస్కౌంట్లు ప్ర‌క‌టించారు. ఐప్యాడ్‌, ఐఫోన్ 7 లేదా 7 ప్ల‌స్ రెండూ కొనాల‌నుకుంటున్న క‌స్ట‌మ‌ర్ల‌కు ఈ ఆఫ‌ర్ వ‌ర్తిస్తుంది. సిటిబ్యాంక్ కార్డు ద్వారా ఐప్యాడ్ ప్రొ, ఐఫోన్ 7 లేదా 7 ప్ల‌స్ తీసుకునేవారికి 23 వేల క్యాష్‌బ్యాక్, ఐప్యాడ్ ఎయిర్ 2, ఐఫోన్ 7 కొంటే 18 వేల క్యాష్‌బ్యాక్ ల‌భిస్తుంది. ఇక ఐప్యాడ్ మినీ 2, 4 మోడ‌ల్స్‌తో క‌లిపి ఐఫోన్ 7 తీసుకుంటే 17 వేల క్యాష్‌బ్యాక్ వ‌స్తుంది.


ఈ కాంబినేష‌న్ల‌కు స్టోర్ల‌లోనూ వ‌రుస‌గా రూ.5900, 2900, 2800 డిస్కౌంట్లు ల‌భించ‌నున్నాయి. అయితే సిటీబ్యాంక్ కార్పొరేట్ క్రెడిట్ కార్డ్స్‌కు మాత్రం ఈ ఆఫ‌ర్ వ‌ర్తించ‌దు. క‌స్ట‌మ‌ర్లు గ్యాడ్జెట్స్‌ను కొనుగోలు చేసిన 90 ప‌నిదినాల్లోపు క్యాష్‌బ్యాక్ డ‌బ్బు వాళ్ల అకౌంట్ల‌లో జ‌మ అవుతుంది. ఈ ఆఫ‌ర్ డిసెంబ‌ర్ 31 వ‌ర‌కు అమ‌ల్లో ఉంటుంది.

3375
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles