బుల్లెట్ రైలు.. కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాలు..

Thu,September 14, 2017 01:09 PM

Interesting facts about bullet train project in India

అహ్మాదాబాద్: బుల్లెట్ రైలుకు సంబంధించి కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలుసుకుందాం. ఇవాళ అహ్మాదాబాద్‌లో బుల్లెట్ రైల్వే ట్రాక్ కోసం శంకుస్థాప‌న చేశారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, జ‌పాన్ ప్ర‌ధాని షింజో అబే ఈ కార్య‌క్ర‌మాల్లో పాల్గోన్నారు. అహ్మాదాబాద్ నుంచి ముంబై వ‌ర‌కు ఈ హై స్పీడ్ కారిడార్‌ను జపాన్ స‌హాయంతో నిర్మిస్తున్నారు. రైలు మార్గం నిర్మాణానికి ఆర్థికంగా, సాంకేతికంగా జ‌పాన్ స‌హ‌క‌రిస్తుంది. ఈ ప్రాజెక్టు కోసం మొత్తం 17 బిలియ‌న్ల డాల‌ర్లు ఖ‌ర్చు చేస్తున్నారు. అంటే, సుమారు ల‌క్షా 9 వేల కోట్లు అన్న‌మాట‌. ఈ మొత్తం ఖ‌ర్చులో జ‌పాన్ మ‌న‌కు 81 శాతం అమౌంట్‌ను ఫైనాన్స్ చేస్తుంది. బుల్లెట్ రైలు కోసం 4300 మంది రైల్వే అధికారులు, సిబ్బందికి జ‌పాన్ ట్రైనింగ్ ఇస్తుంది. ఇంకో స్ట‌న్నింగ్ విష‌యం. బుల్లెట్ రైళ్ల ద్వారా ప్ర‌తి రోజూ 36 వేల మంది ప్యాసింజెర్లు త‌మ గ‌మ్య‌స్థానాల‌కు చేరుతుంటార‌ట‌.ముంబై నుంచి అహ్మాదాబాద్ మ‌ధ్య బుల్లెట్ ట్రాక్ వ‌ల్ల ప్ర‌యాణ దూరం త‌గ్గ‌నున్న‌ది. అంతే కాదు, టైమ్ కూడా త‌క్కువ ప‌డుతుంది. ఈ రెండు స్టేష‌న్ల మ‌ధ్య 508 కిలోమీట‌ర్లు ఉంటుంది. ఇందులో 468 కిలోమీట‌ర్లు.. అంటే 92 శాతం ఎలివేటెడ్ కారిడార్‌గా ట్రాక్‌ను నిర్మిస్తారు. ఇంకా 27 కిలోమీట‌ర్లు అంటే 7 శాతం రూట్ ట‌న్నెల్స్ రూపంలో నిర్మిస్తారు. మ‌రో 13 కిలోమీట‌ర్లు అంటే రెండు శాతం ట్రాక్‌ను గ్రౌండ్ లెవ‌ల్‌లో నిర్మించ‌నున్నారు.


హై స్పీడ్ రైల్ ప్రాజెక్టు వ‌ల్ల మౌళిక‌స‌దుపాయాలు పెరుగుతాయి. క‌నెక్టివిటీ కూడా పెరుగుతుంద‌ని అధికారులు చెబుతున్నారు. ఈ రూట్లో మొత్తం 12 స్టేష‌న్లు ఉంటాయి. బుల్లెట్ రైలు వ‌ల్ల‌ ప్ర‌యాణ స‌మ‌యం సుమారు ఏడు గంట‌ల నుంచి 3 గంట‌ల వ‌ర‌కు త‌గ్గే అవ‌కాశం ఉంది. బుల్లెట్ ట్రైన్ గంట‌కు 320 కిలోమీటర్ల వేగంతో ప్ర‌యాణిస్తుంది.

2675
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles