ఇన్ఫోసిస్ సీఈవో పరేఖ్‌పై ఉద్యోగుల తీవ్ర ఆరోప‌ణ‌లు

Tue,October 22, 2019 07:53 AM

హైద‌రాబాద్‌: దేశీయ ఐటీ రంగంలో రెండో అతిపెద్ద సంస్థగా వెలుగొందుతున్న ఇన్ఫోసిస్‌లో అనైతిక పద్ధతులు నడుస్తున్నాయా? సంస్థ ప్రయోజనాల కోసం తప్పుడు లెక్కలకు పాల్పడుతున్నారా? ఆదాయం, లాభాలు పెరిగేందుకు అడ్డదారులు తొక్కుతున్నారా? అంటే అవుననే సమాధానం వస్తున్నది. సంస్థ సీఈవో సలీల్ పరేఖ్, సీఎఫ్‌వో నిలంజన్ రాయ్‌లు అనైతిక విధానాలను అవలంభిస్తున్నారని ఉద్యోగులే చెబుతున్నారు. ఈ మేరకు కొందరు గుర్తుతెలియని సిబ్బంది ఇన్ఫీ బోర్డుకు లేఖ రాశారు. స్వల్పకాలిక ఆదాయం, లాభాల పెంపే ధ్యేయంగా పరేఖ్, రాయ్‌లు ఈ చర్యలకు పాల్పడుతున్నారని సదరు లేఖలో తమను తాము నీతి, నిజాయితీగల ఉద్యోగులుగా అభివర్ణించుకున్న కొందరు విజిల్‌బ్లోవర్లు తెలియజేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ లేఖను ఇన్ఫోసిస్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లకు వారు గత నెల 20న పంపించారు. మిమ్మల్ని మేము చాలా గౌరవిస్తాం. గడిచిన కొన్ని త్రైమాసికాలుగా సీఈవో సలీల్ పరేఖ్ అనైతిక విధానాలకు పాల్పడుతున్నారు. స్వల్పకాలిక రెవిన్యూ, లాభాలను అధికంగా చూపిస్తున్నారు. ప్రస్తుత త్రైమాసికంలోనూ ఇదే జరిగింది అని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లకు ఇన్ఫీ ఉద్యోగులు ఆ లేఖలో స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో సీఎఫ్‌వో నిలంజన్ రాయ్ పాత్ర కూడా ఉందని ఆరోపించారు.


సీఈవో పరేఖ్ అనైతిక పద్ధతులను అనుసరించడమేగాక, వాటిని సమర్థించుకున్నారని ఉద్యోగులు బో ర్డుకు వివరించారు. మనం చేసే పనుల గురించి బోర్డు లో ఎవరికీ అవగాహన ఉండదు. వారి కి మార్కెట్‌లో సంస్థ షేర్ విలువ పెరిగితే చాలు సంతోషంగా ఉంటారు అని తమతో అన్నట్లు ఉద్యోగులు తెలిపారు. దీంతో ఇన్‌సైడర్ ట్రేడింగ్ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

భారీ ఒప్పందాల్లో నిబంధనల అతిక్రమణ జరిగిందని, సమీక్షలు, అనుమతులు, సూచనలు చేయకుండానే పెద్దపెద్ద డీల్స్‌కు పరేఖ్ పచ్చజెండా ఊపారని ఉద్యోగులు వెల్లడించారు. నిజానికి గడిచిన కొన్ని త్రైమాసికాల్లో కుదిరిన బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాల నుంచి సంస్థకు నయాపైసా లాభం లేదని వారు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఆడిటర్లు, బోర్డు నుంచి కీలక సమాచారాన్ని దాచిపెట్టారని, వెరిజోన్, ఇంటెల్ ఒప్పందాలతోపాటు జపాన్‌లో జాయింట్ వెంచర్లు, ఏబీఎన్ ఆమ్రో కొనుగోలు లావాదేవీలేవీ సక్రమంగా జరుగలేదని, అకౌంటింగ్ ప్రమాణాలను పాటించలేదని పేర్కొన్నారు.

550
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles