4 నెలల చిన్నారిని చిదిమేసిన మృగాడికి ఉరిశిక్ష

Sat,May 12, 2018 04:25 PM

Indore man sentenced to death for rape and murder Of 4 month old

మధ్య ప్రదేశ్: అది ఇండోర్‌లోని రాజ్వాడా ఏరియా. ఏప్రిల్ 20 తెల్లవారుజాము. రాజ్వాడా ఫోర్ట్ బయట ఓ చిన్నారి, తన తల్లిదండ్రులతో కలిసి నిద్రిస్తున్నది. ఇంతలోనే ఓ రాక్షసుడు అక్కడికి వచ్చి చిన్నారి ఎత్తుకెళ్లాడు. పక్కనే ఉన్న బిల్డింగ్ బేస్‌మెంట్ దగ్గరకు తీసుకెళ్లి దారుణంగా ప్రవర్తించాడు. ఆ చిన్నారిపై అత్యాచారం చేసి చంపేశాడు. తర్వాత అదే బిల్డింగ్ బేస్‌మెంట్ దగ్గర రక్తపు మడుగులో చిన్నారి డెడ్‌బాడీ దొరికింది. రాక్షసుడిలా ప్రవర్తించిన ఆ వ్యక్తి చిన్నారి పేరెంట్స్‌కు బంధువే. సీసీటీవీ కెమెరాలో రికార్డయిన వీడియో ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు ఇండోర్ జిల్లా కోర్ట్‌లో ప్రవేశ పెట్టారు.

23 రోజుల విచారణ అనంతరం ఇండోర్ కోర్ట్ నిందితుడు నవీన్ గడ్కేకు పోక్సో చట్టం కింద మరణ శిక్ష విధించింది. 12 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న చిన్నారులపై అత్యాచారం చేస్తే మరణ శిక్ష విధించేలా పోక్సో చట్టంలో సవరణలు చేసిన సంగతి తెలిసిందే. ఉన్నావో, కతువా రేప్ ఘటనపై దేశవ్యాప్తంగా అట్టుడుకుతున్న సమయంలోనే ఈ దారుణం కూడా వెలుగులోకి రావడంతో నిందితుడిని ఉరి తీయాలని దేశవ్యాప్తంగా ఆందోళనలు ఊపందుకున్నాయి. దీంతో ఈ కేసుపై విచారణను వేగవంతం చేసి మృగాడికి మరణ శిక్షను కోర్టు ఖరారు చేసింది.

3463
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles