2 లక్షలు పోసి పెట్ బల్లులను కొన్నాడు.. వీడియో

Fri,March 16, 2018 03:48 PM

Indore juice shop owner pays 2 Lakhs for Pet iguana lizards

సాధారణంగా ఎవరైనా ఇంట్లో కుక్కలను, పిల్లులను పెంచుకుంటారు. చివరికి కుందేలు, ఎలుక, ఉడత, పక్షులను పెంచుకునే వాళ్లను చూశాం కాని. బల్లులను పెంచుకునేవాళ్లను ఎక్కడైనా చూశారా? అది కూడా అక్షరాల రూ. 2 లక్షలు వెచ్చించి మరీ వాటిని కొన‌డం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించట్లేదా. ఎస్.. కాని దాని వెనక ఓ స్టోరీ ఉంది.. అదేంటో తెలుసుకుందాం పదండి..

అది మధ్యప్రదేశ్‌లోని ఇండోర్. ఓ జ్యూస్ షాపు ముందు జనం గుమికూడారు. అందరూ ఆ జ్యూస్ షాపులో ఉన్న ఓ రెండు వింత జంతువులను విచిత్రంగా చూస్తున్నారు. ఇంత వరకు అటువంటి వాటిని చూసి ఉండరు. అందుకే ఇండోర్ నుంచే కాకుండా.. వేరే ప్రాంతాల నుంచి కూడా ప్రజలు వాటిని చూడటానికి తరలివస్తున్నారు. ఎందుకంటే నిజంగానే అవి అరుదైన జాతికి చెందిన జీవులు. అవి చూడటానికి బల్లి, ఉడుము, ఊసరవెల్లి, తొండ.. ఇలా వీటన్నింటిని మిక్స్ చేస్తే వచ్చిన కొత్త రకం జీవిలా ఉంటాయి. వాటినే ఇగ్వానా బల్లులు అని అంటారు. బల్లి జాతికి చెందిన అరుదైన జీవి అట ఇది. ఎక్కువగా ఇవి సౌత్ అమెరికాలో సంచరిస్తుంటాయట. మన దేశంలో అయితే ఇవి ఉండనే ఉండవు. ఇదివరకే కొన్ని రకాల బల్లులను పెంచుకుంటున్న జ్యూస్ షాపు ఓనర్ సాగర్.. అరుదైన బల్లి జాతికి చెందిన ఈ జీవులు ముంబైలో ఉన్నాయని తెలుసుకొని వెంటనే రెండు లక్షలు పోసి మరీ వాటిని తెప్పించుకున్నాడట.

"ఇవి శాకాహారులే. ఇవి 6 ఫీట్ల వరకు పెరగగలవు. వీటిని ఇండియాలో పెంచుకోవచ్చు. ఇవి చూడటానికే భయంకరంగా ఉంటాయి కాని.. అవి చాలా మంచివి. ఎవరికీ ఎటువంటి హానీ తలపెట్టవు. అవి కేవలం క్యారెట్, పంప్‌కిన్, ఆకుకూరలు, కూరగాయలను మాత్రమే తింటాయి" అని వాటిని కొనుక్కున్న సాగర్ తెలిపాడు.

5130
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS