క్లీనెస్ట్ సిటీ.. ఇండోర్ హ్యాట్రిక్‌

Wed,March 6, 2019 01:52 PM

హైద‌రాబాద్: ప‌రిశుభ్ర‌మైన న‌గ‌రంగా మ‌ళ్లీ ఇండోర్ అవార్డు కొట్టేసింది. వ‌రుస‌గా మూడ‌వ సారి ఆ న‌గ‌రానికి క్లీనెస్ట్ సిటీ అవార్డు ద‌క్కింది. స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌ణ అవార్డుల్లో మ‌ధ్య‌ప్ర‌దేశ్‌కు చెందిన‌ ఇండోర్ మ‌ళ్లీ త‌న స్థానాన్ని నిలుపుకున్న‌ది. చ‌త్తీస్‌ఘ‌డ్‌, జార్ఖండ్‌, మ‌హారాష్ట్ర రాష్ట్రాలు మాత్రం .. బెస్ట్ ప‌ర్ఫార్మింగ్ రాష్ట్రాల్లో స్థానాన్ని ద‌క్కించుకున్నాయి. బెస్ట్ గంగా టౌన్‌గా ఉత్త‌రాఖండ్‌లోని గౌచార్‌కు అవార్డు ద‌క్కింది. రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ ఇవాళ న్యూఢిల్లీలో స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌ణ్ అవార్డుల‌ను ప్ర‌దానం చేశారు. న్యూఢిల్లీ మున్సిప‌ల్ కౌన్సిల్ ఏరియాకు. క్లీనెస్ట్ స్మాల్ సిటీ అవార్డు ద‌క్కింది. కేంద్రంలోని హౌజింగ్ అండ్ అర్బ‌న్ అఫైర్స్ మంత్రిత్వ‌శాఖ‌.. స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌ణ్ అవార్డుల‌ను ప్ర‌క‌టిస్తుంది. ఇండోర్‌కు ప‌రిశుభ్ర‌మైన న‌గ‌రంగా అవార్డు వ‌చ్చిన‌ట్లు గృహ‌నిర్మాణ శాఖ మంత్రి హ‌ర్‌దీప్ సింగ్ పురి ట్వీట్ చేశారు.850
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles