రిజ‌ర్వేష‌న్ లేకున్నా.. ఇందిరా గాంధీ రాణించారు..

Mon,January 7, 2019 05:30 PM

నాగ‌పూర్: మాజీ ప్ర‌ధాని ఇందిరా గాంధీపై కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రీ ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. మ‌హిళా రిజ‌ర్వేష‌న్ల హోదా పొంద‌కుండానే ఆమె మ‌గ‌వారి మ‌ధ్య మేటి నేత‌గా ఎదిగార‌ని కొనియాడారు. నాగ‌పూర్‌లో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో గ‌డ్క‌రీ మ‌హిళల రిజ‌ర్వేష‌న్ అంశంపై మాట్లాడారు. మ‌హిళా రిజ‌ర్వేష‌న్‌కు తాను వ్య‌తిరేకం కాదు అని, కానీ కుల‌, మ‌తాల మీద ఆధార‌ప‌డే రాజ‌కీయాల‌ను వ్య‌తిరేకిస్తాన‌న్నారు. అనేక మంది మేటి మ‌గ నేత‌ల మ‌ధ్య ఇందిరా గాంధీ త‌న స‌త్తా చాటారు అని, అది కూడా ఎటువంటి రిజ‌ర్వేష‌న్ సౌక‌ర్యం పొంద‌కుండానే ఆమె పాలించార‌న్నారు. కేంద్ర మంత్రి సుష్మా స్వ‌రాజ్‌, రాజ‌స్థాన్ మాజీ సీఎం వ‌సుంధ‌రా రాజే, లోక్‌స‌భ స్పీక‌ర్ సుమిత్రా మ‌హాజ‌న్ లాంటి మేటి మ‌హిళా నేత‌లు కూడా ఎటువంటి రిజ‌ర్వేష‌న్ సౌక‌ర్యం పొంద‌కుండానే రాజ‌కీయాల్లో రాణిస్తున్నార‌న్నారు. ఎవ‌రైనా త‌మ‌కు ఉన్న ప్ర‌తిభ మేర‌కే రాణిస్తార‌ని, కానీ భాష‌, కులం, మ‌తం, ప్రాంతం లాంటి అంశాల‌మీద కాదు అని ఆయ‌న అన్నారు.

1798
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles