ఇండియన్స్ ఎవరిని ఎక్కువగా నమ్ముతారో తెలుసా?

Fri,July 13, 2018 01:18 PM

Indians trust Army the most and political parties the least

న్యూఢిల్లీ: భారతీయులు ఎవరిని ఎక్కువగా నమ్ముతారు? దీనిపై అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీ (ఏపీయూ), సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ (సీఎస్‌డీఎస్) సంయుక్తంగా ఓ సర్వే నిర్వహించారు. దేశంలోని 22 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 16680 మందిని సర్వే చేశారు. ఇందులో అత్యధిక మంది తాము ఇండియన్ ఆర్మీని ఎక్కువగా విశ్వసిస్తామని చెప్పారు. ఆర్మీ తర్వాత సుప్రీంకోర్టు, హైకోర్టులు నిలిచాయి.

అన్నింటి కంటే తక్కువగా రాజకీయ పార్టీలు అట్టడుగున నిలవడం విశేషం. అంటే అసలు పార్టీలను తాము నమ్మడం లేదని మెజార్టీ ప్రజలు స్పష్టంచేశారు. పార్టీలది ఎంత దారుణం అంటే వాటిపై సగటు విశ్వాసం -1.75 శాతం ఉండటం గమనార్హం. ఇక ప్రభుత్వ అధికారులపై తమకు నమ్మకం ఉన్నదని 4.8 శాతం మంది మాత్రమే చెప్పారు. ఇక అత్యధికంగా ఇండియన్ ఆర్మీని 77 శాతం మంది విశ్వసిస్తున్నారు.

54.8 శాతం మంది సుప్రీంకోర్టుపై, 48 శాతం మంది హైకోర్టులపై తమకు విశ్వాసం ఉన్నట్లు చెప్పారు. అత్యంత విశ్వాసం ఉన్నదని చెప్పిన వాళ్లు, అసలు విశ్వాసం లేదు అని చెప్పిన వాళ్ల మధ్య తేడాను సగటు విశ్వాసంగా పరిగణించారు. రాష్ట్రపతి, ప్రధాని, ముఖ్యమంత్రి, పార్లమెంట్, శాసనసభలు, పంచాయతీ/మున్సిపల్ కార్పొరేషన్లు 40 శాతం సగటు విశ్వాసాన్ని పొందాయి. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, జార్ఖండ్, చత్తీస్‌గఢ్ రాష్ర్టాల్లో ఈ సర్వే నిర్వహించారు.

4470
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles