ట్రాష్‌టాగ్ చాలెంజ్‌ను సీరియస్‌గా తీసుకున్న ఇండియన్స్.. ఫోటోలు

Thu,March 14, 2019 08:24 PM

Indians Take To Viral Trash tag Challenge

ట్రాష్‌టాగ్ చాలెంజ్ గుర్తుంది కదా మీకు. విదేశాల్లో ప్రారంభమైన ఈ చాలెంజ్ మెల్లగా ఇండియాకు కూడా పాకింది. అయితే.. ఇదేదో మిగితా చాలెంజ్‌లా టైమ్ పాస్ కోసం స్టార్ట్ చేసింది కాదు.. పర్యావరణాన్ని కాపాడటం కోసం.. ఈ ప్రపంచాన్ని కాపాడటం కోసం పుట్టుకొచ్చిందే ఈ చాలెంజ్. ఈ చాలెంజ్ 2015లోనే ప్రారంభమైనప్పటికీ.. ఇప్పుడిప్పుడే సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది.

ట్రాష్‌టాగ్ చాలెంజ్ అంటే ఏం చేయాలో తెలుసా మీకు. ఎక్కడైనా చెత్త ఉంటే.. ఆ చెత్తను క్లీన్ చేయాలనుకుంటే.. క్లీన్ చేయడానికి ముందు.. క్లీన్ చేసిన తర్వాత ఫోటో తీసి ట్రాష్‌టాగ్ చాలెంజ్ హాష్‌టాగ్‌తో సోషల్ మీడియాలో షేర్ చేయడమే. అయితే.. ఈ చాలెంజ్‌ను ఇండియాలో కూడా కొంతమంది సీరియస్‌గా తీసుకున్నారు. ఇండియాలో ముంబైకి చెందిన లాయర్ అఫ్రాజ్ షా... చెత్తతో నిండి ఉన్న వెర్సోవా బీచ్‌ను క్లీన్ చేయడం కోసం ముంబైకర్స్‌ను ఎంకరేజ్ చేయాలని ఆ హాష్‌టాగ్‌ను ఉపయోగించారు. వెర్సోవా బీచ్‌ను క్లీన్ చేయడానికి అఫ్రాజ్ టీమ్‌కు 3 ఏళ్లు పట్టిందట.

నెమ్మదిగా.. ఈ చాలెంజ్‌పై అవగాహన పెంచకున్న ఇండియన్స్ బాగానే ఈ చాలెంజ్‌పై వర్కవుట్ చేస్తున్నారు. చాలామంది చొరవ తీసుకొని చెత్తను క్లీన్ చేసి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. దానికి సంబంధించిన ఫోటోలను మీరూ చూడండి.

It took 3 years to clean the Versova Beach in Mumbai. All this happened due to exemplary efforts of one man(Afroz Shah) and his team. #trashtag ! from r/pics


Trash Tag challenge done by Mahindra employees in India from r/pics2141
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles