చంద్రయాన్‌లో ఇది ఆరంభం మాత్రమే : ఇస్రో ఛైర్మన్‌

Mon,July 22, 2019 03:25 PM

Indian Space Research Organisation Chief K Sivan and other scientists celebrate

హైదరాబాద్‌ : అంతరిక్ష ప్రయోగాల్లో భారత్‌ సరికొత్త విజయం సాధించిందని ఇస్రో ఛైర్మన్‌ డాక్టర్‌ కే. శివన్‌ పేర్కొన్నారు. చంద్రయాన్‌ -2 పరీక్ష విజయవంతం కావడంతో ఇస్రో ఉద్యోగులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శివన్‌ మాట్లాడారు. మార్క్‌-3 విజయం కొత్త ఉత్సాహం నింపిందన్న ఆయన చంద్రయాన్‌లో ఇది ఆరంభం మాత్రమే అని చెప్పారు. ప్రతి క్షణం అత్యంత కఠినమైన పరీక్షలను ఎదుర్కొన్నాం. తీవ్రమైన సాంకేతిక సమస్యలను అధిగమించగలిగాం. సమస్యను గుర్తించి వారంలోనే పరిష్కరించాం. శాస్త్రవేత్తలందరూ 24 గంటలూ తదేక దీక్షతో పని చేశారు. శాస్త్రవేత్తల అంకితభావం, కృషి మాకు ఈ విజయాన్ని అందించిందని ప్రశంసించారు. లాంఛ్‌ వెహికల్‌ టీమ్‌ అత్యంత సునిశిత పరిజ్ఞానంలో విజయం సాధించింది. ప్రతి అంశాన్ని లాంఛ్‌ వెహికల్‌ టీమ్‌ క్షుణ్ణంగా పరిశీలించి నిర్ధారించింది. ఇప్పటికీ రాకెట్‌ను విజయంతంగా నింగిలోకి పంపాం. అసలు ప్రయోగం ఇప్పుడు ప్రారంభమవుతుంది. వచ్చే 45 రోజులు మాత్రమే మాకు అత్యంత కీలకం. సెప్టెంబర్‌ 7 రాత్రి ల్యాండర్‌ చంద్రుడిపై దిగిన తర్వాత యాత్ర పూర్తవుతుందని ఇస్రో ఛైర్మన్‌ తెలిపారు.

1184
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles