డ్రైవర్ లేకుండా పరుగెత్తే బస్సు.. కేవలం 15 లక్షలు మాత్రమే!

Thu,January 17, 2019 04:32 PM

indian reserchers develop driverless solar bus

మనవాళ్లు ఏకంగా గూగుల్ వంటి ప్రపంచ దిగ్గజాలతో పోటీ పడుతున్నారు. స్వయంచాలిత వాహనాల అభివృద్ధిలో ముందంజ వేశారు. డ్రైవర్ లేకుండా నడిచే బస్సు భారతీయ పరిశోధకులు రూపొందించారు. పైగా ఇప్పటిదాకా ప్రపంచంలో రూపొందిన వాహనాలన్ని కూడా పెట్రోల డీజెల్ లేదా సీఎన్జీ మీద నడిచేవే. మనవాళ్లు రూపొందించిన బస్సు సౌరశక్తి మీద నడుస్తుంది. ఒకసారి చార్జి చేస్తే ఈ బస్సు 70 కిలోమీటర్ల దాకా పరుగెడుతుంది. తొలి నమూనా సిద్ధమైంది. దీనికైన ఖర్చు కేవలం 15 లక్షలు మాత్రమే. రాజస్థాన్ ఫగ్వాడాలోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీకి చెందిన 300 మంది విద్యార్థులు, 50 మంది అధ్యాపకులు సమిష్టిగా దీనిని తయారు చేశారు. యూనివర్సిటీ ప్రాంగణంలోని వర్క్‌షాప్‌లోనే దీనికి ప్రాణం పోశారు. 2014లో డ్రైవర్ లేని గోల్ఫ్‌కార్ట్ తయారు చేశామని, ఇప్పుడు ఒకడపగు ముందుకువేసి సౌరశక్తితో నడిచే డ్రైవర్ లేని బస్సును సిద్ధం చేశామని ప్రాజెక్ట్ లీడర్ మందీప్‌సింగ్ చెప్పారు. ఈ బస్సుకు సెన్సర్ వ్యవస్థ రూపొందించడంలో సాయపడ్డానని ముస్కాన్ అనే విద్యార్థి చెప్పారు.

3668
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles