శ్రీ రామాయణ ఎక్స్‌ప్రెస్.. ఇండియన్ రైల్వేస్ ప్రత్యేక రైలు

Wed,July 11, 2018 01:14 PM

Indian Railways to run Shri Ramayana Express for tourists in November

న్యూఢిల్లీ: ఇండియన్ రైల్వేస్ ఓ ప్రత్యేక పర్యాటకుల రైలును నడపబోతున్నది. దీనిపేరు శ్రీ రామాయణ ఎక్స్‌ప్రెస్. నవంబర్‌లో ప్రయాణం ప్రారంభించే ఈ రైలు.. రామాయణంలో ప్రస్తావించిన ప్రాంతాలన్నింటి గుండా ప్రయాణిస్తుంది. యూపీలోని అయోధ్యలో మొదలయ్యే ఈ ప్రయాణం తమిళనాడులోని రామేశ్వరం గుండా శ్రీలంకలోని కొలంబోలో ముగుస్తుంది. శ్రీలంక వెళ్లాలనుకునే ప్రయాణికులు.. చెన్నై నుంచి కొలంబోకు విమానంలో వెళ్లాల్సి ఉంటుంది. ఈ రైలు నవంబర్ 14న ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ స్టేషన్ నుంచి బయలుదేరుతుంది. మొత్తం 16 రోజుల ప్రయాణం. అయోధ్యలో తొలి స్టాప్ ఉంటుంది. అక్కడి నుంచి నందిగ్రామ్, సీతామర్హి, వారణాసి, ప్రయాగ్, శ్రీనగవేర్పూర్, చిత్రకూట్, హంపి, నాసిక్ మీదుగా రామేశ్వరం చేరుకుంటుందని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ట్వీట్ చేశారు.


ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా శ్రీలంకలోని రామాయణంతో సంబంధం ఉన్న ప్రదేశాలు కూడా ఉన్నాయి. రామేశ్వరం తర్వాత కూడా ప్రయాణాన్ని కొనసాగించాలని అనుకునేవాళ్లు చెన్నై నుంచి కొలంబోకు విమానంలో వెళ్లాల్సి ఉంటుంది. శ్రీలంకలో క్యాండీ, నువారా ఎలియా, కొలంబో, నెగోంబోల గుండా ప్రయాణం సాగుతుంది. దీనికి ప్రత్యేకంగా చార్జీ వసూలు చేస్తారు. ఈ ప్రత్యేక రైలులో మొత్తం 800 సీట్లు అందుబాటులో ఉంటాయి. ఐఆర్‌సీటీసీ ఈ టూర్‌ను ఆర్గనైజ్ చేస్తున్నది. ఒక్కో వ్యక్తికి రూ.15,120 వసూలు చేయనున్నారు. త్వరలోనే ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌తోపాటు దేశంలోని తమ 27 సెంటర్లలో టికెట్లు అందుబాటులో ఉంటాయని ఆ సంస్థ తెలిపింది. భోజన, వసతి సదుపాయాలన్నీ ఈ ప్యాకేజీలో భాగంగానే ఉంటాయి. మధ్యమధ్యలో సైట్ సీయింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయనుంది.

2423
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles