చిత్తాపూర్ వ‌ర‌కు తాండూరు మెమూ రైలు

Thu,January 24, 2019 01:52 PM


హైద‌రాబాద్ : దేశ‌వ్యాప్తంగా 22 రైళ్లను పొడిగించారు. రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయ‌ల్ ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. తెలంగాణ ప్రాంతంలో ప్ర‌యాణించే రెండు రైళ్లు కూడా అందులో ఉన్నాయి. సికింద్రాబాద్ నుంచి తాండూర్ వ‌ర‌కు వెళ్లే మెమూ రైలును ఇప్పుడు క‌ర్నాట‌క‌లోని చిత్తాపూర్ వ‌ర‌కు పొడిగించారు. 67249/67250 రైలు ఇప్పుడు మంత‌ట్టి, న‌వాంద‌గి, కురుగుంట‌, సీర‌మ్‌, మ‌ల్కైద్ రోడ్డు స్టేష‌న్ల‌లో ఆగ‌నున్న‌ది. ఇక మిర్యాల‌గూడ నుంచి కాచికూడ మ‌ధ్య న‌డిచే డెమో రైలును ఇప్పుడు న‌డికుడి వ‌ర‌కు పొడ‌గించారు. 77673/77674 నంబ‌ర్ డెమో రైలు ఇక నుంచి కొండ్ర‌పోలు, విష్ణుపురం, పొడుగుల స్టేష‌న్ల‌లో ఆగ‌నున్న‌ది.

2201
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles