తిత్లీ ఎఫెక్ట్.. రంగంలోకి దిగిన భారత నేవీ సిబ్బంది

Fri,October 12, 2018 05:20 PM

Indian Navy joins relief operations in severe Titli Cyclone affected areas

బంగాళాఖాతంలో ఏర్పడిన తిత్లీ తుపాను ధాటికి ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా అతలాకుతలం అవుతోంది. గురువారం ఉదయమే తిత్లీ తుపాను శ్రీకాకుళం జిల్లాలో తీరాన్ని దాటింది. దీంతో ఉత్తరాంధ్ర ప్రాంతంలో అతి భారీ వర్షాలో పాటు ఈదురు గాలులు వీచాయి. ఏపీతో పాటు ఒడిశాలో తీవ్ర నష్టం వాటిల్లింది. చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. కొబ్బరి, అరటి తోటలు ధ్వంసమయ్యాయి. రవాణా స్థంభించింది.

దీంతో భారత నేవీ రంగంలోకి దిగింది. వెంటనే ఉత్తరాంధ్ర, సైత్ ఒడిశాలో సహాయక చర్యలను ప్రారంభించింది. హెలికాప్టర్ల ద్వారా తిత్లీ ప్రభావ ప్రాంతాలకు ఆహారం, మంచినీటిని అందించింది. తిత్లీ తుపాను బారిన పడి నిరాశ్రయులైన వారిని వెంటనే శిబిరాలకు తరలించారు. సహాయక కార్యక్రమాలు ఇంకా కొనసాగుతున్నాయి. మరో 24 గంటల పాటు ఏపీ, ఒడిశాలో భారీ వర్షాలు పడొచ్చని విశాఖ వాతావరణ విభాగం తెలిపింది.


1138
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles