ముంబై వాసులకు టీ, టిఫిన్స్ అందించిన నేవీ

Wed,August 30, 2017 01:32 PM

Indian Navy distributed breakfast and tea to Mumbai people


ముంబై: రెండు రోజులుగా ముంబై నగరాన్ని భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. భారీ వర్షాల ధాటికి ముంబై, థానేతోపాటు పరిసర ప్రాంతాలు నీట మునిగిపోవడంతో వేలాదిమంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. వర్షాలతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న ముంబై వాసులకు ఇండియన్ నేవీ అధికారులు ఆహారాన్ని అందించారు. నేవీ అధికారుల బృందం ఇవాళ ఉదయం ఛత్రపతి శివాజీ టర్మినల్ రైల్వే స్టేషన్ వద్ద ముంబై వాసులకు ఛాయ్‌తోపాటు టిఫిన్స్ అందించింది. ఉదయం నుంచి వెయ్యి మందికి ఆహారాన్ని అందించామని, ప్రస్తుతం మరో 800 మంది అందిస్తున్నామని ఇండియన్ నేవీ కమాండర్ తెలిపారు. భారీ వర్షాలకు ఎక్కువ మంది నిరాశ్రయులయ్యారని..వారికి ఆహారాన్ని సరఫరా చేసేందుకు సన్నద్ధమవుతున్నామని కమాండర్ వెల్లడించారు.
rains-tea2
rains-tea
rains-tea4

1248
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles