పాక్ దిశ‌గా.. యుద్ధ నౌక‌లు, న్యూక్లియ‌ర్ స‌బ్‌మెరైన్లు !

Mon,March 18, 2019 05:32 PM

Indian Navy deploys aircraft carrier and nuclear submarines

హైద‌రాబాద్: పాకిస్థాన్‌తో ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో .. భార‌త నౌకాద‌ళం త‌న అణ్వ‌స్త్ర జ‌లాంత‌ర్గాముల‌ను అప్ర‌మ‌త్తంగా ఉంచింది. డ‌జ‌న్ల సంఖ్య‌లో యుద్ధ నౌక‌లు, విమాన నౌక‌లు, న్యూక్లియ‌ర్ స‌బ్‌మెరైన్లను స‌ముద్ర జ‌లాల్లో సంసిద్ధంగా ఉంచిన‌ట్లు ఇండియ‌న్ నేవీ స్ప‌ష్టం చేసింది. ర‌ష్యా నిర్మించిన ఐఎన్ఎస్ విక్ర‌మాదిత్యతో పాటు ఇత‌ర యుద్ధ నౌక‌లు సిద్ధంగా మ‌న జ‌లాల్లో ఉన్నాయి. పాక్ ఎటువంటి దుస్సాహాసం చేసినా.. అటువంటి ప్ర‌య‌త్నాల‌ను తిప్పి కొట్టేందుకు తాము సిద్ధంగా ఉన్న‌ట్లు నేవీ తెలిపింది. అయితే ఎక్కువ శాతం యుద్ధ నౌకలు ఇవాళ ప్రారంభ‌మైన‌ ట్రోపెక్స్ సైనిక విన్యాసాల్లో పాల్గొన్న‌ట్లు తెలుస్తోంది. అన్ని యుద్ధ నౌక‌ల‌ను ఆప‌రేష‌న‌ల్ డిప్లాయ్‌మెంట్ మోడ్‌లో ఉంచిన‌ట్లు ఆర్మీ వెల్ల‌డించింది. నౌక‌లు ఎక్క‌డ‌, ఎలా సిద్ధంగా ఉన్నాయ‌న్న అంశాల‌ను మాత్రం ఆర్మీ వెల్ల‌డించ‌లేదు. కానీ భార‌త్ వ‌ద్ద అణ్వాయుధాలు మోసుకెళ్లే యుద్ధ నౌక‌ల్లో ఐఎన్ఎస్ చ‌క్ర‌, ఐఎన్ఎస్ అరిహంత్‌లు మాత్ర‌మే ఉన్నాయి. పుల్వామా దాడి త‌ర్వాత‌ అణ్వాయుధ జ‌లాంత‌ర్గాముల‌ను సిద్ధంగా ఉంచిన‌ట్లు తెలుస్తోంది.

7047
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles