కుల్‌భూషన్ జాదవ్‌ను కలవనున్న తల్లి, భార్య

Mon,December 25, 2017 09:45 AM

Indian national Kulbhushan Jadhav wife and mother will meet him in pakistan today

పాకిస్థాన్: గూఢచర్యం ఆరోపణలతో మాజీ నేవీ ఆఫీసర్ కుల్‌భూషన్ జాదవ్‌కు పాకిస్థాన్ కోర్టు మరణ శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పాకిస్థాన్ జైలులో ఉన్న జాదవ్‌ను కలవడానికి తల్లి, భార్య ఇవాళ పాకిస్థాన్ వెళ్లనున్నారు. ఇండియన్ డిప్యూటీ హైకమిషనర్ జేపీ సింగ్ వారిని పాకిస్థాన్‌కు తీసుకువెళ్లనున్నారు. ఇస్లామాబాద్‌లో జాదవ్‌ను వీళ్లు కలుస్తారు. ఢిల్లీ నుంచి కమర్షియల్ విమానంలో మధ్యాహ్నం ఇస్లామాబాద్‌కు వెళ్లి.. జాదవ్‌ను కలిసిన తర్వాత ఇవాళ సాయంత్రం తిరిగి భారత్ చేరుకోనున్నారు. గుఢచర్యం ఆరోపణలతో గత సంవత్సరం పాకిస్థాన్ ఆర్మీ జాదవ్‌ను అరెస్ట్ చేసిన తర్వాత మొదటి సారి జాదవ్ తన కుటుంబ సభ్యులను ఇవాళ కలుసుకోబోతున్నాడు.

1306
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles