రిషబ్ పంత్‌పై ఇండియన్ ఫ్యాన్స్ సూపర్ సాంగ్.. వీడియో

Fri,January 4, 2019 03:15 PM

Indian Fans at Sydney Ground sing a Rishab Pant Song during fourth test

సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో టీమిండియా వికెట్ రిషబ్ పంత్ సెంచరీ చేసిన విషయం తెలుసు కదా. ఆసీస్ గడ్డపై సెంచరీ చేసిన తొలి వికెట్ కీపర్‌గా పంత్ రికార్డు కూడా సృష్టించాడు. నిజానికి ఈ సిరీస్ మొదలైనప్పటి నుంచీ పంత్ వార్తల్లో నిలుస్తున్నాడు. ఆసీస్ కెప్టెన్ టిమ్ పేన్‌తో తరచూ గొడవ పడుతూ, మాటలతో అతన్ని రెచ్చగొడుతూ, అతని పిల్లలను ఎత్తుకొని సవాళ్లు విసురుతూ.. ఇన్నాళ్లూ వార్తల్లో ఉన్నాడు. తొలిసారి ఆస్ట్రేలియాకు బ్యాట్‌తోనూ సవాలు విసిరాడు. ఈ సందర్భంగా సిడ్నీ టెస్ట్‌ను ప్రత్యక్షంగా చూస్తున్న కొందరు ఇండియన్ ఫ్యాన్స్.. గ్యాలరీల్లో నిల్చొని రిషబ్ పంత్‌పై పాడిన ఓ పాట ఇప్పుడు వైరల్‌గా మారింది. వీ హావ్ గాట్ పంత్.. రిషబ్ పంత్.. హీ విల్ హిట్ యు ఫర్ ఎ సిక్స్.. హీ విల్ బేబీసిట్ యువర్ కిడ్స్.. వీ హావ్ గాట్ రిషబ్ పంత్ అంటూ ఫ్యాన్స్ అప్పటికప్పుడు ఓ పాట అల్లేసి పాడారు. ఈ పాట విన్నాక ప‌క్క‌నే ఉన్న ఆస్ట్రేలియా ఫ్యాన్స్ మొహాలు వాడిపోయాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారిపోయింది.


2567
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles