ఐసీస్ చెర నుంచి తెలుగు డాక్టర్ విడుదలSun,February 26, 2017 10:33 AM
ఐసీస్ చెర నుంచి తెలుగు డాక్టర్ విడుదల

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌కు చెందిన డాక్టర్ కె. రామమూర్తి ఐసీస్ ఉగ్రవాదుల చెర నుంచి సురక్షితంగా విడుదలయ్యాడు. లిబియాలో వైద్య వృత్తిలో స్థిరపడ్డ రామమూర్తిని 18 నెలల క్రితం ఉగ్రవాదులు కిడ్నాప్ చేసిన విషయం విదితమే. 18 నెలల తర్వాత ఐసీస్ ఉగ్రవాదుల నుంచి తప్పించుకునే సమయంలో రామమూర్తికి బుల్లెట్ గాయమైంది. భారత్‌కు సురక్షితంగా చేరిన రామమూర్తి ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఉగ్రవాదాన్ని భారత్‌లో విస్తరించాలనే ఆలోచనతో ఐసీస్ ఉన్నదని తెలిపారు.

అయితే ప్రణాళికలు మాత్రం తనకు చెప్పలేదని పేర్కొన్నారు. వాళ్లు చేసిన అకృత్యాలకు సంబంధించిన వీడియోలు చూడాలని ఒత్తిడి తెచ్చేవారని, తనను మానసికంగా చిత్రహింసలకు గురి చేశారని ఆవేదన చెందారు. ఐసీస్ కోసం తనను పని చేయమని కోరారని, అందుకు తాను ఒప్పుకోలేదన్నారు. ఉగ్రవాదుల నుంచి సురక్షితంగా విడిపించిన భారత ప్రభుత్వానికి, ప్రధాని మోదీకి రామమూర్తి కృతజ్ఞతలు చెప్పారు.


860
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS