పొలార్డ్‌పై భారత అభిమానుల ఆగ్రహం

Thu,November 8, 2018 10:32 AM

indian cricket fans angry over kieron pollard

లక్నో: వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించిన విషయం విదితమే. ఈ గెలుపుతో భారత్ టీ20 సిరీస్‌ను కైవసం చేసుకుంది. అయితే లక్నో టీ20 మ్యాచ్‌లో వెస్టిండీస్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఇన్నింగ్స్ 11వ ఓవర్‌లో భారత బౌలర్ బుమ్రా వేసిన బంతిని విండీస్ బ్యాట్స్‌మన్ పొలార్డ్ ఆడగా, బంతి బ్యాట్‌కు తాకి గాల్లోకి లేచింది. దీంతో బుమ్రా క్యాచ్ పట్టాడు. అయితే బుమ్రా క్యాచ్ పడుతుండగా, అతని దృష్టి మరల్చేందుకు పొలార్డ్ చేతిని పైకి లేపాడు. అయినప్పటికీ బుమ్రా క్యాచ్ అందుకున్నాడు. వెంటనే అతను పొలార్డ్ వైపు అసహనంగా చూశాడు. కాగా ఈ వీడియో ఇప్పుడు నెట్‌లో వైరల్ అవుతుండగా, పొలార్డ్ చేసిన పనికి భారత అభిమానులు అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తొండి ఆట ఆడుతున్నావ్.. అంటూ విమర్శిస్తున్నారు. అయితే బుమ్రా, పొలార్డ్‌లు ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టు ఆటగాళ్లు కావడం విశేషం.


3968
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles