ఆర్మీ కాల్పుల్లో ఇద్దరు పాక్ జవాన్లు మృతి

Tue,August 14, 2018 11:31 AM

Indian Army in retaliation firing kills two Pakistan soldiers

న్యూఢిల్లీ: పాకిస్థాన్ స్థావరాలపై భారత ఆర్మీ కాల్పులు జరిపింది. ఆ కాల్పుల్లో ఇద్దరు పాకిస్థాన్ సైనికులు మృతిచెందారు. జమ్మూకశ్మీర్‌లోని కుప్వారాలో సోమవారం పాక్ కాల్పులు జరిపింది. ఆ ప్రాంతంలో భారత బలగాలు కూడా ఎదురు కాల్పులు జరిపాయి. అయితే ఆ కాల్పుల్లో ఇద్దరు పాక్ సైనికులు మృతిచెందినట్లు రక్షణశాఖ పీఆర్వో తెలిపారు. మరో వైపు ఇవాళ పాకిస్తాన్ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటున్నది. వాఘా బోర్డర్ వద్ద పాక్, భారత జవాన్లు స్వీట్లు పంచుకున్నారు.

1018
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles